
తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఏర్పడిన అడ్డంకులు తొలగిపోవడం గమనార్హం. 2017 సంవత్సరంలో 1100 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఇన్ సర్వీస్ లో ఉన్నవాళ్లకు ఏడాదికి రెండు మార్కుల వంతున గరిష్టంగా పదేళ్లు పరిగణనలోకి తీసుకోవాలని రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు భావించారు.
అయితే తెలంగాణ ట్రాన్స్ కో తీసుకున్న నిర్ణయంపై కొందరు ఇన్ సర్వీస్‌మెన్లు కోర్టు మెట్లెక్కగా ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్లకు వెయిటేజీ సమంజసం అని కోర్టు తీపులో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పది, ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మెన్ ట్రేడ్, ఐటీఐ ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్స్ చదివిన వాళ్లు జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు నోటిఫికేషన్ రిలీజైంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
https://tstransco.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఉన్నాయి.