మన శరీరానికి ముఖ్యమైన వాటిలో నీళ్లు ఒకటనే సంగతి తెలిసిందే. మనుషులు ఆహారం లేకుండా అయినా కొన్ని రోజులు సులభంగా జీవించే అవకాశం ఉంటుంది కానీ నీళ్లు లేకుండా మాత్రం జీవించడం సాధ్యం కాదు. నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో నీళ్లు తాగడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పండ్లు తిన్న తరువాత నీళ్లు తాగకపోతే మంచిది.
పండ్లలో షుగర్ కంటెంట్ లేదా సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల 45 నిమిషాల వరకు నీళ్లు తాగకూడదు. ఐస్ క్రీం తిన్న తరువాత కూడా నీళ్లు తాగకూడదు. ఐస్ క్రీమ్ తిన్న 15 నిమిషాల తర్వాత నీళ్లు తాగవచ్చు. టీ, కాఫీ, వేడి పానీయాలు తాగిన తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. కూల్ లేదా వేడి కలిపి తీసుకుంటే బరువు, వాయువు, ఆమ్లత్వం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
వేరుశనగలు తిన్న తర్వాత కూడా నీటిని తాగకూడదు. తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు, గొంతు నొప్పి, ఇతర సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్వీట్లు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. అలా చేస్తే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్నం తినే సమయంలో, భోజనానికి 45 నిమిషాల ముందు 45 నిమిషాల తర్వాత నీళ్లు తాగకూడదు.
ఒకవేళ నీళ్లు తాగితే ఊబకాయం వచ్చే సమస్య ఉండటంతో పాటు ఆహారం జీర్ణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చాలా వేగంగా పరుగెత్తాక వెంటనే నీళ్లను తాగకూడదు. అలా చేస్తే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండకూడదు.