Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. గ్యాంబ్లర్, వివేకం, విశ్వాసం వంటి చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న తమిళ హీరో అజిత్‌తో కలిసి నాగార్జున మల్టీస్టారర్ మూవీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించనున్న చిత్రంలో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రకు నాగార్జునను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి నాగార్జున కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించనున్నాడట. ఇదే చిత్రంలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నాడని టాక్.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప’పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. స్మగ్లర్‌ని హీరోగా ఎలా చూపిస్తారంటూ ప్రశ్నించారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా కొన్ని సినిమాలు ఉండటం లేదని తెలిపారు. ‘‘ స్మగ్లింగ్ చేసే వ్యక్తి ‘తగ్గేదే లే’ అంటాడా? ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ‘తగ్గేదే లే’ అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. విక్రమ్, అతని కుమారుడు ధృవ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మహాన్’. నేరుగాఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రయిలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో విక్రమ్ ఓ టీచర్‌గా కనిపిస్తుండగా.. సిమ్రాన్ అతని భార్యగా నటించింది.
కాగా కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 10న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూద్దాం.
