Allu Arjun: కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాడు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి బెంగళూరు చేరుకున్నాడు. ముందుగా పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ తర్వాత పునీత్ సమాధిని బన్నీ సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాడు.

కాగా ఈ నేపథ్యంలో కన్నడ పవర్‌స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీని అల్లు అర్జున్ తాజగా పరామర్శించాడు . పునీత్ సోదరుడు స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో కాసేపు మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బన్నీ రాకతో శివరాజ్కుమార్ ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: అంతా అయిపోయాక చిలకపలుకులు పలికితే ఎలా మాళవిక ?
పునీత్ ఫ్యామిలీని పరామర్శించిన అల్లు అర్జున్, కాసేపట్లో పునీత్ సమాధి వద్ద బన్నీ నివాళులు అర్పించనున్నాడు. అక్కడకు కూడా పునీత్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి రానున్నారు. కాగా, గతేడాది అక్టోబర్ 29న జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో పునీత్ మరణించాడు. పునీత్ అభిమానులు గుండెలు పగిలేలా రోధించారు.

అన్నట్టు పునీత్ సేవకు బన్నీ సాయం చేయనున్నాడు అని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా 1800 పిలల్లలకు పునీత్ చదువు చెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పిల్లల్ని నేను చదివిస్తా…అని ముందుకు రాబోతున్నాడు బన్నీ. ఆ 1800 మంది పిల్లల భవిష్యత్తుకీ భరోసా కల్పించడమే తన ఉద్దేశ్యం అని బన్నీ ఫీల్ అవుతున్నాడు. అలాగే పునీత్ స్టార్ట్ చేసిన అనాధశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు కూడా బన్నీ సాయం చేస్తాడట.
Also Read: నసంద్రమైన విజయవాడ.. అండర్‌గ్రౌండ్‌లోకి ఉద్యోగసంఘాల నేతలు