KCR-Vinod Kumar: భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. భారత రాజ్యాంగంపైనే కామెంట్లు చేయడం సీఎం నైతికతకు నిదర్శనమని చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన దీక్షచేపడుతున్నారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మౌన దీక్ష చేశారు. దీంతో కేసీఆర్ తీరుకు అన్ని వర్గాల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి.

అయితే దీనిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఓ ఆసక్తి కర చర్చకు తెరలేపారు. కేసీఆర్ మాటలను వక్రీకరించి అన్ని పార్టీలను ఇరుకున పెట్టాలనిచూస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో రాజ్యాంగాన్ని పలు మార్లు మార్పులు చేర్పులు చేశారని గుర్తు చేశారు.దీనిపైనే కేసీఆర్ మాట్లాడారని మరో వాదన తెరమీదకు తీసుకొచ్చారు.
బీజేపీ నాయకులకు రాజ్యాంగంపై అవగాహన లేదని ప్రతివిమర్శకు దిగుతున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో కూడా రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేసిన విషయం గుర్తు చేశారు. ఇప్పటికే ఎన్నో మార్లు రాజ్యాంగాన్ని మార్చిన విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ మాట్లాడిన మాటలను మారుస్తూ పార్టీలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
Also Read: CM KCR: కేసీఆర్ నిజంగానే జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారా?
రాజ్యాంగం పై చర్చ కొత్తేమీ కాదని ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నదే. దీని గురించే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పారని గుర్తు చేశారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఒంటికాలుపై లేవడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వినోద్ కుమార్ తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు చేశారు. దీంతో వినోద్ కుమార్ కేసీఆర్ ను వెనకేసుకు వచ్చారు. ఈ క్రమంలో వాజ్ పేయి హయాంలో వేసిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగంలోని లోపాలు బయటపెట్టలేదా అని గుర్తు చేశారు.
కేంద్రం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకునే క్రమంలో కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని చెప్పే బదులు రాజ్యాంగాన్ని మార్చాలని తూలనాడిన సంగతి తెలిసిందే. దీనిపై వినోద్ కుమార్ పార్టీలపై తన అక్కసు వెళ్లగక్కారు. దీంతో రాజ్యాంగంపై చర్చ మరో దారి మళ్లుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఏం చర్యలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Also Read: CM KCR: హ్యాట్రిక్ సీఎం కావాలంటున్న కేసీఆర్.. రంగంలోకి దిగిన పీకే షాడో బృందం!
[…] […]
[…] […]