https://oktelugu.com/

Nag Ashwin Tweet Viral: ప్రభాస్ కు ఆనంద్‌ మహీంద్రా సాయం.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Nag Ashwin Tweet Viral: నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ కోసం ఆనంద్‌ మహీంద్రాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్ ద్వారా సహాయం కోరాడు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. తమ చిత్రానికి సాంకేతిక సహకారం కావాలన్న నాగ్ అశ్విన్ అభ్యర్థనపై స్పందిస్తూ.. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా తిరస్కరిస్తాం నాగ్‌ అశ్విన్‌. మా గ్లోబల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ వేలు మహీంద్రా మీకు సహకారం అందిస్తారని బదులిచ్చారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 5, 2022 / 12:34 PM IST
    Follow us on

    Nag Ashwin Tweet Viral: నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ కోసం ఆనంద్‌ మహీంద్రాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్ ద్వారా సహాయం కోరాడు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. తమ చిత్రానికి సాంకేతిక సహకారం కావాలన్న నాగ్ అశ్విన్ అభ్యర్థనపై స్పందిస్తూ.. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా తిరస్కరిస్తాం నాగ్‌ అశ్విన్‌. మా గ్లోబల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ వేలు మహీంద్రా మీకు సహకారం అందిస్తారని బదులిచ్చారు.

    Nag Ashwin Tweet Viral

    ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై అధికారిక అప్ డేట్ కావాలంటూ గత కొంత కాలంగా ట్విట్టర్ లో సినిమా మేకర్స్ కి మెసేజ్ లు పెడుతూ వస్తున్నారు. అయితే, సినిమా యూనిట్ ప్రస్తుత ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక గేమ్ షోను గ్రాండ్ గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    Nag Ashwin Tweet Viral

    ఇక ఈ సినిమా వచ్చే వారంలో యాక్షన్ సీన్స్ కోసం సెట్స్ పైకి వెళ్ళనుంది. కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ ను శరవేగంగా షూట్ చేయనున్నారు. ఇక మొదటినుంచీ ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు.

    Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో సినిమా జరుగుతుందట. ప్లాష్ బ్యాక్ లో ఈ దివి సీన్స్ వస్తాయని.. అలాగే సినిమాలో మూడు కాలాలకు సంబంధించిన కథ ఉంటుందని.. అయితే అన్నిటిలోకల్లా దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.

    అలాగే ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ కథలో రెండు విభిన్న పాత్రలను సృష్టించాడని.. పైగా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. అందుకే అన్ని భాషల వారికి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని టీమ్ నమ్మకంగా ఉంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంది.

    Also Read: హీరోయిన్ కి అసభ్యకర మెసేజ్​లు.. ప్రముఖ వ్యక్తి కుమారుడు అరెస్ట్​

    Tags