భారత ఐటీ నిపుణులకు గొప్ప శుభవార్త

అమెరికాలో శాశ్వత నివాసానికి దారులు తెరిచే గ్రీన్ కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు, ఐటీ నిపుణులకు శుభవార్త. గ్రీన్ కార్డుల జారీపై దేశాలవారీ పరిమితిని ఎత్తివేయాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేంట్ వీసాల్లో ప్రతి దేశానికి ఏడు శాంతం పరిమితి ఉంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) చట్టం 2021 ఈ పరిమితిని […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 10:26 am
Follow us on

అమెరికాలో శాశ్వత నివాసానికి దారులు తెరిచే గ్రీన్ కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు, ఐటీ నిపుణులకు శుభవార్త. గ్రీన్ కార్డుల జారీపై దేశాలవారీ పరిమితిని ఎత్తివేయాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేంట్ వీసాల్లో ప్రతి దేశానికి ఏడు శాంతం పరిమితి ఉంది.

ప్రస్తుతం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) చట్టం 2021 ఈ పరిమితిని తొలగించాలని కోరుతోంది. పుట్టిన దేశం ఆధారంగా కోటాల పద్ధతిలో కాకుండా నైపుణ్యం ఆధారంగా అమెరికాలో నివాసానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఈ బిల్లు ప్రతినిధుల సభ నుంచి సెనెట్ కు వెళుతుంది.

ప్రస్తుత విధానంలో హెచ్-1బి పని వీసాలపై వచ్చి ఈ 7% పరిమితి కారణంగా గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. తాజా బిల్లులో ఆ పరిమితిని ఎత్తివేయడంతో పాటు కుటుంబ ప్రాయోజిత వీసాలపై ఉన్న పరిమిని7 నుంచి 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. తక్కువ జనాభా ఉన్న వాటికి ఎక్కువ జనాభా ఉన్న దేశాలకూ ఒకే పరిమితి విధించారు. ఇది పూర్తిగా అర్థరహితం. మన దేశ ఆర్థిక వ్యవస్థకిది నష్టం చేస్తుంది అని డెమొక్రాటిక్ ప్రతినిధి లోవ్ గ్రెన్ వ్యాఖ్యానించారు.

పుట్టిన ప్రదేశానికి కాదు వచ్చే వారు అమెరికాకు ఎంతగా ఉపయోగపడుతుందనేది కీలకం. అమెరికా కంపెనీలు నిపుణులైన వారిని నియమించుకుని మన దేశంలో మరిన్ని ఉద్యోగాలు పెంచే సేవలు ఉత్పత్తులను సృష్టించాలి అని
ఆమె సూచించారు. ఇప్పుడున్న పద్ధతి ప్రకారమైతే దాదాపు 10 లక్షల మంది భారతీయ నిపుణులు 200 సంవత్సరాలు వేచి చూసిన గ్రీన్ కార్డు వస్తుదో రాదో తెలియని పరిస్థితి. మరో వైపు చిన్న దేశాల్లోని వారికి మాత్రం సులభంగా కార్డు లభిస్తోంది. ఇకమీదట ఆ పరిస్థితి ఉండదు అని ఇమ్మిగ్రేషన్ వాయిస్ వ్యవస్థాపకులు అమన్ కపూర్ వ్యాఖ్యానించారు.