Hyundai Exter Sales: SUV వెర్షన్ లో అమ్మకాల రాజు.. నెలకు 7 వేలకు పైగా విక్రయం.. ఈ కారు గురించి తెలుసా?

SUV కారు కొనాలనుకునేవారు హ్యుందాయ్ వైపు చూడాలని కొందరు వినియోగదారులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ వెర్షన్ లో ఇప్పటికే కంపెనీ నుంచి కొన్ని మోడల్స్ వచ్చి సక్సెస్ అయ్యాయి. లేటేస్టుగా ఎక్స్ టర్ అమ్మకాల్లో దూసుకుపోతుంది. ఇటీవల కంపెనీ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం... Hyundai Exter SUV మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే 93,000 యూనిట్లను సొంతం చేసుకున్నట్లు ఇదివరకే తెలిపింది.

Written By: Chai Muchhata, Updated On : July 18, 2024 10:13 am

Hyundai Exter Sales

Follow us on

Hyundai Exter Sales: ప్రస్తుత కాలంలో కార్లు కొనాలనుకునేవారు SUVలను ఎక్కువగా కోరుకుంటున్నారు. గతంతో 4 వీలర్ హ్యాచ్ బ్యాక్ ఉంటే చాలానుకునేవారు.. ఇప్పుడు ఎస్ యూవీ వేరియంట్ లో అవసరాలకు అనుగుణంగా ఉండాలని అనుకుంటున్నారు. హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే ఎస్ యూవీ లు ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇవి విశాలమైన స్పేస్ తో పాటు ఇంజిన్ లోనూ అధిక పవర్ ను కలిగి ఉంటాయి. దీంతో కొన్ని కంపెనీలు కేవలం ఎస్ యూవీలపైనే ఫోకస్ పెడుతూ ఉన్నాయి. అయితే SUV లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా వాటి సేల్స్ పెరగడం కాస్త కష్టతరమైన పనే. కానీ హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఓ మోడల్ ఈ వేరియంట్ లో అమ్మకాల్లో దూసుకుపోతుంది. నెలకు 7వేల చొప్పున యూనిట్లు విక్రయాలు చేసుకుంటూ మిగతా వాటి కంటే ముందు వరుసలో ఉండేందుకు పోటీ పడుతోంది. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

SUV కారు కొనాలనుకునేవారు హ్యుందాయ్ వైపు చూడాలని కొందరు వినియోగదారులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ వెర్షన్ లో ఇప్పటికే కంపెనీ నుంచి కొన్ని మోడల్స్ వచ్చి సక్సెస్ అయ్యాయి. లేటేస్టుగా ఎక్స్ టర్ అమ్మకాల్లో దూసుకుపోతుంది. ఇటీవల కంపెనీ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం… Hyundai Exter SUV మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే 93,000 యూనిట్లను సొంతం చేసుకున్నట్లు ఇదివరకే తెలిపింది. అయితే తాజాగా తెలిపిన ప్రకారం వీటి అమ్మకాలు నెలకు 7,750 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

ఇదే కంపెనీకి చెందిన Xt గ్రాండ్ ఐ 10 నియోస్ ఎస్ యూవీని రిలీజ్ చేసింది. ఈ ప్లాట్ ఫాం పైనే రెడీ అయి రిలీజ్ అయిన ఎక్స్ టర్ ను వినియోదారులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అయితే ఐ 10 కంటే ఎక్స్ టర్ డిజైన్ విభిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఐ 10 కంటే ఎక్కువ పనితీరును కలిగి ఉంది. ఆకర్షణీయమైన బాడీ స్టైల్ ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారులను ఆకర్షించే కలర్లలో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండడంతో ఎక్స్ టర్ పై ఎక్కువగా మోజు పెంచుకుంటున్నారు.

ఎక్స్ టర్ ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 1.2 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను ఉంటుంది. ఈ ఇంజిన్ 81 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 114 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ లో మాత్రమే కాకుండా సీఎన్ జీ వెర్షన్ లో అందుబాటులో ఉన్న ఎక్స్ టర్.. పెట్రోల్ వెర్షన్ లో అయితే 19.4 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీలో కిలో ఇంధనానికి 27.1 కిలోమీటరల్ వరకు వెళ్తుంది.

హ్యుందాయ్ ఎక్స్ టర్ ఫీచర్లే దీని అమ్మకాలు పెంచుతుందన్న చర్చ సాగుతోంది. ఈ మోడల్ ఇంటీరియర్ లో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉంది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆకర్షిస్తుంది. వైర్ లెస్ చార్జర్ సదుపాయం ఉంది. ఇక ఇందులో సేప్టీ ఫీచర్ విషయానికొస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. త్రీ పాయింట్ సీట్ బెల్ట్ ప్రధానంగా రక్షణను ఇస్తాయి. వీటితో పాటు ఈ మోడల్ లో అదనంగా మరికొన్ని లెటేస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్ టర్ ధర మార్కెట్లో ప్రస్తుతం రూ.6 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ లో దీనిని రూ.10 లక్షలతో విక్రయించనున్నారు. ఇది మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది.