https://oktelugu.com/

BBC Classic Entertainment : క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సీజన్ షురూ.. ఇక బీబీసీ వ్యూవర్స్ కు పండుగే..

బీబీసీ ఒలింపిక్ కవరేజీలో భాగంగా ఈ ఎంటర్టైన్మెంట్ సీజన్ ను బీబీసీ ప్రసారం చేయనుంది. జూలై ఆఖరి వారం నుంచి మూడు శనివారాల పాటు రాత్రి పూట బీబీసీ ఫోర్, ఐ ప్లేయర్ లో ఈ క్లాసిక్ సీజన్ ప్రసారమవుతుంది. ఈ సేకరణ బీబీసీ లో ది జనరేషన్ గేమ్, బ్లాంకెటీ బ్లాంక్ ఎపిసోడ్ లతో పాటు నోయెల్స్ హౌస్ పార్టీ, బాబ్స్ ఫుల్ హౌస్ తో పాటు ఈ ఏడాది 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న స్ర్టిక్లీ కమ్ డ్యాన్సింగ్ యొక్క మొదటి ఎపిసోడ్ సరసన ఈ సిరీస్ ఉంటుంది

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 02:47 PM IST
    Follow us on

    BBC Classic Entertainment  : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ప్రేక్షకులకు బీబీసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మరో మెగా ఈవెంట్ కు బీబీసీ సిద్ధమవుతున్నది. బీబీసీ క్లాసిక్ సీజన్ ను తాజాగా అనౌన్స్ చేసింది. ఎంటర్టైన్మెంట్ సీజన్ బీబీసీ ఫోర్, ఐ ప్లేయర్ లో ప్రతి శనివారం రాత్రి నడుస్తుందని ప్రకటించింది. గత ఐదు దశాబ్ధాలుగా ఈ సీజన్ ను బీబీసీ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఒలంపిక్ సీజన్ లో ప్రతి శనివారం నిర్వహించే ఈ కార్యక్రమ షెడ్యూల్ ను బీబీసీ ప్రకటించింది. తమ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ క్లాసిక్ సీజన్ కొనసాగుతుందని బీబీసీ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

    ఒలింపిక్ కవరేజీలో భాగంగా..
    బీబీసీ ఒలింపిక్ కవరేజీలో భాగంగా ఈ ఎంటర్టైన్మెంట్ సీజన్ ను బీబీసీ ప్రసారం చేయనుంది. జూలై ఆఖరి వారం నుంచి మూడు శనివారాల పాటు రాత్రి పూట బీబీసీ ఫోర్, ఐ ప్లేయర్ లో ఈ క్లాసిక్ సీజన్ ప్రసారమవుతుంది. ఈ సేకరణ బీబీసీ లో ది జనరేషన్ గేమ్, బ్లాంకెటీ బ్లాంక్ ఎపిసోడ్ లతో పాటు నోయెల్స్ హౌస్ పార్టీ, బాబ్స్ ఫుల్ హౌస్ తో పాటు ఈ ఏడాది 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న స్ర్టిక్లీ కమ్ డ్యాన్సింగ్ యొక్క మొదటి ఎపిసోడ్ సరసన ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటిష్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ బీబీసీ ఈ సీజన్ ద్వారా మరింత దగ్గరవనుంది‌.

    ఐదు దశాబ్దాలుగా..
    ఇందులో భాగంగా బీబీసీ మేనేజ్‌మెంట్ హెడ్ లిండ్సే క్యూరీ మాట్లాడుతూ “ఐదు దశాబ్దాల బీబీసీ వినోదం ద్వారా మా ప్రేక్షకులను ఈ నాస్టాలిక్ వినోదంలోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. బీబీసీ వన్ ఒలింపిక్స్‌కు అంకితం చేసినప్పుడు, బీబీసీ ఫోర్ క్లాసిక్ షోల నిధిని ప్రేక్షకులకు అందిస్తున్నదని తెలిపారు. ఈ క్లాసిక్ సీజన్ వీక్షణను మా ప్రేక్షకులు అత్యంత ఇష్టపడుతారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బీబీసీ ఫోర్ మంచి కంటెంట్ తో పాటు సేకరణను అందిస్తుందని చెప్పారు. బ్రిటీష్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మేధో ఆశయం ఆలోచనల నుంచి కళలు, సంగీతం పై ప్రత్యేక దృష్టి కలిగిన ప్రేక్షకుల కోసమే ఈ స్పెషల్ డాక్యుమెంటరీ ఉంటుందని, అందుకే బీబీసీ ఈ క్లాసిక్ సీజన్ ను తీసుకువస్తున్నదని తెలిపారు. ఈ సీజన్ పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బీబీసీ ఫోర్, ఐ ప్లేయర్లలో జూలై 27 శనివారం నుంచి ఈ క్లాసిక్ సీజన్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈరోజు కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్లుగా భావిస్తున్నామని ఆయన ప్రకటించారు. అయితే గతంలో కూడా బీబీసీ ఇలాంటి క్లాసిక్ ఎంటర్మెంట్ సీజన్లను నిర్వహించి విజయవంతంగా నడిపించింది. ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరైంది. మరి ఈసారి కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ సీజన్ నిర్వహించేందుకు బీబీసీ సిద్ధం అవుతోంది.

    సీజన్లలో ముఖ్యమైనవి ఇవే..
    * బ్రూస్ ఫోర్సిత్ జనరేషన్ గేమ్ (1970 ,1990)
    * సర్ టెర్రీ వోగాన్స్ బ్లాంకెటీ బ్లాంక్ (1970 )
    * లెస్ డాసన్ బ్లాంకెటీ బ్లాంక్ (1980)
    * లిల్లీ సావేజ్ యొక్క బ్లాంకెటీ బ్లాంక్ (1990)
    * బాబ్స్ ఫుల్ హౌస్ (1980)
    * నోయెల్స్ హౌస్ పార్టీ (1990)
    * లారీ గ్రేసన్ జనరేషన్ గేమ్ (1970)
    * స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్ (స్ట్రిక్ట్లీ ఫస్ట్ ఎపిసోడ్ 15 మే 2004న ప్రసారం చేయబడింది)
    * టెర్రీ వోగన్ (2012)
    * వన్ ఆన్ వన్: టెర్రీ వోగన్ (2002)