https://oktelugu.com/

Ravi Teja Heroine: ఫ్యాన్స్ షాక్ అయ్యేలా మారిపోయిన రవితేజ నేనింతే మూవీ హీరోయిన్… ఇప్పుడు ఏం చేస్తుందంటే…

Ravi Teja Heroine: ఒకటి రెండు సినిమాలే అయినా కూడా తమ నటనతో ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుండి పోయారు.అలా ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల మదిలో ఇప్పటికి నిలిచిపోయిన హీరోయిన్లలో హీరోయిన్ శియా గౌతమ్ కూడా ఒకరు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 15, 2024 / 02:47 PM IST

    Ravi Teja Neninthe movie Heroine Siya Gautam

    Follow us on

    Ravi Teja Heroine: టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్ ఇలా సినిమా ఇండస్ట్రీ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల,హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు ప్రతి రోజు సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చాలా మంది హీరో,హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అయ్యాయి.అయితే చిన్ననాటి ఫొటోలతో పాటు హీరో,హీరోయిన్ లకు సంబంధించిన రేర్ ఫోటోలు మరియు వీడియొ లు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.ఒకప్పుడు ఇండస్ట్రీ ని ఏలిన స్టార్ హీరో,హీరోయిన్ లు ప్రస్తుతం ఎలా ఉన్నారు..ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి అభిమానులు బాగా ఆసక్తిని చూపిస్తారు.అలాగే ఒకటి రెండు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను తెచ్చుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ కి దూరం అయినా ముద్దు గుమ్మలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు.

    అయితే వీరు చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా కూడా తమ నటనతో ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుండి పోయారు.అలా ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల మదిలో ఇప్పటికి నిలిచిపోయిన హీరోయిన్లలో హీరోయిన్ శియా గౌతమ్ కూడా ఒకరు.ఈమె మాస్ మహారాజ్ రవితేజ కు జోడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన నేనింతే సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.2008 లో రిలీజ్ అయినా ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అయితే రాబట్టలేకపోయింది.ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లో ప్రసారం అయితే అభిమానులు టీవీ లకు అతుక్కుపోతారు.చాలా మందికి ఈ సినిమా ఆల్ టైం ఫెవరెట్ మూవీ.ఈ సినిమాలో సాంగ్స్,సీన్స్ ఇప్పటికి కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటాయి.

    ఇక ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది.ఈ సినిమాతోనే శియా గౌతమ్ తెలుగు తెర కు పరిచయం అయ్యింది.మొదటి సినిమా తోనే శియా గౌతమ్ తన అందం తో నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.ఈమె అసలు పేరు అదితి గౌతమ్.అయితే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత శియా గౌతమ్ గా పేరు మార్చుకుంది ఈ అమ్మడు.ఈమెకు నటన పై చాలా ఆసక్తి ఉంది.ఆ ఆసక్తి తోనే ఈమె మొదట మోడలింగ్ రంగం లో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.ఆ తర్వాత సినిమాలలో అవకాశం రావడం తో హీరోయిన్ గా సినిమాలోకి అడుగు పెట్టింది.నేనింతే సినిమాలో హీరో రవి తేజ కు జోడిగా హీరోయిన్ గా నటించింది శియా గౌతమ్.అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

    అందం,అభినయం ఉన్నశియా గౌతమ్ కు తెలుగు లో సినిమా అవకాశాలు చుట్టూ ముడతాయి అనుకున్నారు అందరు.కానీ ఆమెకు ఈ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు.శియా గౌతమ్ ఆశించిన స్థాయిలో సినిమా రంగంలో రాణించలేకపోయింది అని చెప్పచ్చు.బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ అమ్మడు.రణబీర్ కపూర్ కు జోడిగా సంజూ సినిమా లో నటించింది.కానీ ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అక్కడ కూడా గుర్తింపును సంపాదించుకోలేకపోయింది.దాంతో ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను అవకాశాలు రాకపోవడంతో ప్రసుతం సినిమాలకు దూరం గా ఉంటుంది.అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఆక్టివ్ గా ఉంటుంది శియా గౌతమ్.ప్రస్తుతం సోషల్ మీడియా లో శియా గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో శియా గౌతమ్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.