https://oktelugu.com/

Mahesh Babu Son: మహేష్ కుమారుడు గౌతమ్ సినిమాల్లో గ్రాండ్ ఎంట్రీ… ఎప్పుడో తెలుసా…

Mahesh Babu Son: మహేష్ బాబు లుక్ కూడా ఇటీవలే నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.తాజాగా మహేష్ బాబు వారసుడి గ్రాండ్ ఎంట్రీ గురించి ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో అందరికి ఆసక్తిని కలిగిస్తుంది.సినిమా ఇండస్ట్రీ లో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణమే.

Written By:
  • Srinivas
  • , Updated On : July 15, 2024 / 02:53 PM IST

    Mahesh Babu Son Gautham Krishna Undergoing Training

    Follow us on

    Mahesh Babu Son: టాలీవుడ్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయినా ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంమైన కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే.సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ కల్కి సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది.ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి నాగ్ అశ్విన్,ప్రభాస్ కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.అయితే అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా భారీ విజయం సాధించింది.ఇప్పుడు మరో మూడు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ సినిమాలతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరొక సినిమా రాజమౌళి,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

    ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ కూడా ఇటీవలే నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.తాజాగా మహేష్ బాబు వారసుడి గ్రాండ్ ఎంట్రీ గురించి ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో అందరికి ఆసక్తిని కలిగిస్తుంది.సినిమా ఇండస్ట్రీ లో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణమే.ఇప్పటి వరకు ఎందరో స్టార్ హీరోల,హీరోయిన్ ల వారసులు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ఇదే క్రమంలో ఘట్టమనేని వంశం నుంచి మూడో తరం వారసులు అంటే మహేష్ బాబు కూతురు,కొడుకు అని చెప్పచ్చు.తాజాగా మహేష్ బాబు కుమారుడు ఘట్టమనేని గౌతమ్ బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి లండన్ వెళ్లడం జరిగింది.అయితే అక్కడ గౌతమ్ ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరొక వైపు యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

    యాక్టింగ్ లో శిక్షణ పొందేందుకు గౌతమ్ న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీకి వెళ్తున్నారని సమాచారం.తన చదువు పూర్తి అయినా వెంటనే ఘట్టమనేని గౌతమ్ కూడా తన తండ్రి మహేష్ బాబు లాగానే ఒక మంచి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది.గౌతమ్ తన తండ్రి మహేష్ బాబు లెగసీని కంటిన్యూ చేయడంలో ఫ్యాన్స్ ను ఏ మాత్రం నిరాశపరచరని చెప్పచ్చు.టాలీవుడ్ లో గౌతమ్ గ్రాండ్ ఎంట్రీ కోసం మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.ఇక మహేష్ బాబు ముద్దుల కూతురు ఘట్టమనేని సితార గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సితార కు సోషల్ మీడియా లో చాలా ఫాలోయింగ్ ఉంది.తన డాన్స్ వీడియొ లను,ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సితార ఎప్పుడు అభిమానులకు దగ్గరగా ఉంటుంది.కొన్ని యాడ్స్ లో కూడా నటించి సితార తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

    సితార కు సంబంధించిన ప్రతి డాన్స్ వీడియొ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నట్లుగా సితార ప్రతి ఒక్క విషయం లోను తన తండ్రి మహేష్ బాబు ను తలపిస్తూ ఉంటుంది అని చెప్పడం లో సందేహం లేదు.ఇప్పటి వరకు కొన్ని వాణిజ్య ప్రకటనలలో కూడా నటించిన ఘట్టమనేని సితార తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ సితార మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత మరియు కూతురు సితార తో కలిసి ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరు అయ్యారు.ఈ పెళ్లి లో మహేష్ బాబు తన భార్య మరియు కూతురితో దిగిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో మహేష్ బాబు లుక్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.