
తనను హౌస్ అరెస్టు చేశారంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు లేఖ రాయడంపై పోలీసులు స్పందించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ కు లేఖ రాశారు. పార్లమెంట్ కు వెళ్లకుండా తాము అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు. కోకాపేట భూముల వద్ద ఆందోళనకు అనుమతి లేదని అందువల్లే రేవంత్ నివాసం వద్ద పోలీసు బలగాలను మోహరించినట్లు స్పష్టం చేశారు.