Rajendra Prasad : ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ఇటీవలే ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మాట్లాడిన మాటలు మీడియా లో పెను దుమారం రేపింది. అసభ్యకరమైన బూతులతో మాట్లాడి రాజేంద్ర ప్రసాద్ తన గౌరవాన్ని కోల్పోయే స్థాయికి పడిపోయాడు. దీనిపై కనీసం మూవీ టీం అయిన రెస్పాన్స్ ఇచ్చి డేవిడ్ వార్నర్ కి క్షమాపణలు చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ మూవీ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వీడియో బాగా వైరల్ అయ్యి రాజేంద్ర ప్రసాద్ వరకు చేరింది. చివరకు ఆయన డేవిడ్ వార్నర్ కి క్షమాపణలు చెప్తూ కాసేపటి క్రితమే ఒక వీడియో ని విడుదల చేసారు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా క్షమాపణలు చెప్పి తన గౌరవాన్ని కాపాడుకున్నాడు.
Also Read : డేవిడ్ వార్నర్ ని అడ్డమైన బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!
ఆయన మాట్లాడుతూ ‘నాకు డేవిడ్ వార్నర్ అంటే ఎంతో ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉంది. అతని క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. డేవిడ్ వార్నర్ మన తెలుగు సినిమాలను, తెలుగు సినిమాల నటీనటుల నటనను ఎంతో ఇష్టపడతాడు. నాకు తెలిసి షూటింగ్ సమస్యల్లో మేమిద్దరం బాగా క్లోజ్ అయిపోయాము. ఏది ఏమైనా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన సంఘటన నాకు తెలియకుండా మీ మనసుని ఏమైనా బాధపెట్టి ఉన్నట్టు అయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ మాత్రం కావు, అయినా కూడా నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఇక మీదట ఇలా మాట్లాడను, ఇలాంటి సంఘటనలు జరగవు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మీడియా కి విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన క్షమాపణలు చెప్పడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా అభినందిస్తున్నారు.
అయితే ఇదంతా మూవీ టీం కావాలని చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ కాదు కదా అని మరికొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గానే రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆశించిన స్థాయిలో ట్రెండ్ కొనసాగడం లేదు. ఏదైనా మసాలా ఉంటే సినిమా జనాలకు మరింతగా రీచ్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో మూవీ టీం కావాలని ఇలాంటి పని చేయించిందా అని అనుమానిస్తున్నారు. ఆరోజు రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడుతుంటే ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. డేవిడ్ వార్నర్ కి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడింది అర్థమైందో లేదో తెలియదు కానీ, మాట్లాడున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాడు. ఈవెంట్ నుండి బయటకు వెళ్లిన తర్వాత అయినా అతనికి ఎవరో ఒకరు చెప్పి ఉంటారు. అందుకేనేమో రాజేంద్ర ప్రసాద్ వార్నర్ కి అర్థం అయ్యేలా వీడియో ఆరంభంలో ఇంగ్లీష్ లో మాట్లాడాడు.
ఇదేం మొదటిసారి కాదులే ప్రసాదూ
రాత్రి వాగడం … పగలు కవర్ చేసుకోవడం ♂️♂️ pic.twitter.com/iecYTFvviO
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) March 25, 2025