ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారడం మామూలే. అధికార పార్టీ నీడన తమ పనులు చేసుకునే క్రమంలో నేతలు పార్టీలను వీడుతుంటారు. 2019లో అధికారం కోల్పోయిన నాటి నుంచి టీడీపీ నేతలు వైసీపీలోకి వలస వెళుతున్నారు. దీంతో టీడీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీని విడిచిపెట్టారు. ఓటమి పాలైన నేతలు సైతం పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ దుకాణం ఖాళీ అవుతుందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో వైసీపీకి బలం పెరిగే అవకాశం ఏర్పడుతోంది.
ప్రస్తుతం వైసీపీలో చాలా మంది నేతలు పని లేకుండా ఉన్నారు. వారికి కాంట్రాక్టులు, ఇతర పనులు అప్పగించడం ద్వారా వారి సేవలు ఉపయోగించుకుంటున్నారు. వీరంతా వైసీపీని వదిలేస్తారా అనే అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి.దీనికి తోడు టీడీపీ నాయకులు సైతం వైసీపీ నుంచి కూడా వలసలు ఉంటాయని చెప్పడంతో పార్టీలో కలవరం రేగుతోంది. గత ఎన్నికల్లో ఓడినవారు, అసంతృప్తితో ఉన్నవారిని గుర్తించి వారు పార్టీ మారకుండా ఉండేందుకు చర్యలు చేపట్టే పనిలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో కొందరిని పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. వారికి పదవులు ఇస్తామని ఆశచూపి తరువాత పట్టించుకోలేదు. దీంతో వారిలో కూడా ఆత్మాభిమానం పెరుగుతోంది. దీంతో పార్టీ మారతారేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పక్కకు పెట్టిన వారందరు రుసరుసలాడుతున్నారని తెలుస్తోంది. దీంతో వారిని బుజ్జగించే పనిలో నాయకత్వం తలమునకలవుతోంది. టీడీపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు తర్వాత ఎవరు పార్టీని నడిపిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
లోకేష్ నాయకత్వంపై ఎవరికి విశ్వాసం లేదు. పార్టీ భవిష్యత్తును ఆయన నిర్దేశించలేరనే వాదం వినిపిస్తోంది. ఆయన అందరికంటే చిన్న వయసు వాడు కావడంతో ఎవరు కూడా ఆయన పెత్తనంపై విశ్వాసం ఉంచడం లేదు. చంద్రబాబు తరువాత పార్టీ పగ్గాలు చేపట్టే నాయకుడి కోసం అందరు ఎదురుచూస్తున్నారు. సమర్థుడైన నాయకుడైతేనే పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.
లోకేష్ పై అప్పుడే అసమ్మతి సెగలు కక్కుతున్న నేతలు కనిపిస్తున్నారు. ఆయన పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొస్తారనే ఆశ వారిలో కనిపించడం లేదు. దీంతో వారిలో నైరాశ్యం కనిపిస్తోంది. తెలుగు తమ్ముళ్లను సరైన దారిలో నడిపించే వారి కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుకు వయసు మీద పడడంతో ఆయన పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని ఎవరు రక్షిస్తారోనని ఆందోళన నెలకొంది.