https://oktelugu.com/

విషాదం : ఆ సీనియర్ నటి ఇక లేరు !

శివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్‌ వంటి దిగ్గజ నటులతో ఆమె కలిసి నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో ప్రేక్షక లోకాన్ని మైమరిపించారు. ఆమె సీనియర్‌ నటి జెమినీ సరస్వతి. 94 ఏళ్ల ఆమె వయసు రీత్యా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే ఆమెకు సడెన్ గా గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కానీ ఆమె చికిత్స పొందుతూనే కన్నుమూశారు. చికిత్సకి మొదట్లో […]

Written By:
  • admin
  • , Updated On : June 29, 2021 11:20 am
    Follow us on

    gemini saraswathiశివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్‌ వంటి దిగ్గజ నటులతో ఆమె కలిసి నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో ప్రేక్షక లోకాన్ని మైమరిపించారు. ఆమె సీనియర్‌ నటి జెమినీ సరస్వతి. 94 ఏళ్ల ఆమె వయసు రీత్యా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే ఆమెకు సడెన్ గా గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

    కానీ ఆమె చికిత్స పొందుతూనే కన్నుమూశారు. చికిత్సకి మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా ఆమె ఆరోగ్య ప‌రిస్థితి ఒక్కసారిగా విష‌య‌మించింది. దాంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ఆమె ప్రాణాలను వైద్యులు కాపాడలేయారు. ఎమోషనల్ పాత్రలకు ప్రాణం పోసిన జెమినీ సరస్వతి ఇక లేరు అనేసరికి సినీ అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.

    కారైకుడికి చెందిన జెమినీ సరస్వతి 5వ తరగతి చదువుకున్నారు. ఆ రోజుల్లోనే ఆమె నాట్యం పై ఆసక్తితో, సినిమాల్లో నటించాలనే ఆశతో అప్పటి ఆచారాలను ఎదిరించి చెన్నైకి వచ్చిన ధైర్యవంతురాలు ఆమె. ఇక చంద్రలేఖ చిత్రం ద్వారా డాన్సర్‌ గా పరిచయమయ్యారు. ఈమె అసలు పేరు సరస్వతి. జెమినీ సంస్థ నిర్మించిన చంద్రలేఖ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయడంతో ఆమెకు జెమినీ సరస్వతిగా గుర్తింపు వచ్చింది.

    జెమినీ సరస్వతికు దక్షిణామూర్తి, సెల్వరాజ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సరస్వతి మరణానికి పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున సీనియర్ నటి జెమినీ సరస్వతి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.