https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్ : ఆ హీరోకి మూడో హీరోయిన్ గా ‘శివాత్మిక’ !

హీరో రాజశేఖర్ ముద్దుల తనయ ‘శివాత్మిక రాజశేఖర్’కి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి అని పుకార్లు అయితే పుట్టించారు కానీ, ఆమెకు మాత్రం సైడ్ రోల్స్ మాత్రమే వచ్చాయి. కానీ, హీరోయిన్ గానే కొనసాగాలనేది శివాత్మిక ఆశ. అందుకే కేవలం హీరోయిన్ పాత్రల కోసమే తానూ ఎదురు చూస్తున్నాను అంటూ ఇప్పటికే మేకర్స్ కి క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుండి ఆ వచ్చే సైడ్ క్యారెక్టర్స్ కూడా రావడం మానేశాయి. ఇక ఈ క్రమంలో ఇలాగే ఉంటే […]

Written By:
  • admin
  • , Updated On : June 29, 2021 / 11:09 AM IST
    Follow us on

    హీరో రాజశేఖర్ ముద్దుల తనయ ‘శివాత్మిక రాజశేఖర్’కి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి అని పుకార్లు అయితే పుట్టించారు కానీ, ఆమెకు మాత్రం సైడ్ రోల్స్ మాత్రమే వచ్చాయి. కానీ, హీరోయిన్ గానే కొనసాగాలనేది శివాత్మిక ఆశ. అందుకే కేవలం హీరోయిన్ పాత్రల కోసమే తానూ ఎదురు చూస్తున్నాను అంటూ ఇప్పటికే మేకర్స్ కి క్లారిటీ ఇచ్చింది.

    అప్పటి నుండి ఆ వచ్చే సైడ్ క్యారెక్టర్స్ కూడా రావడం మానేశాయి. ఇక ఈ క్రమంలో ఇలాగే ఉంటే ఖాళీగా ఉండాల్సి వస్తోందని ఈ బ్యూటీకి అర్ధం అయినట్టు ఉంది. దాంతో తన తల్లి జీవిత సహకారంతో తన చూపు తమిళం వైపు వేసింది. ఇప్పటికే ఒక తమిళ సినిమాలో శివాత్మిక నటించింది. తాజాగా ఆమె తన రెండో తమిళ సినిమా కోసం కూడా సైన్ చేసింది.

    యువ హీరో అశోక్ సెల్వన్ ఓ సినిమా చేస్తున్నాడు. పైగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఆ హీరోయిన్స్ లిస్ట్ లో మరో తెలుగు బ్యూటీ రీతూ వర్మతో పాటు ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి కూడా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ సినిమాలో మూడో భామగా శివాత్మిక నటించబోతుంది. ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రకటించనున్నారు.

    నిజానికి శివాత్మికది ఈ సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ ఆమె పాత్ర చుట్టే సినిమా మొత్తం తిరుగుతుందట. ఇంతకీ శివాత్మిక తమిళ సినిమాలు చేస్తే.. ఆమె ఆశించిన పాపులారిటీ వస్తోందా ? తెలుగులో పాపులర్ అవుదామని ప్రయత్నించినా విఫలమైంది కాబట్టి, ఇప్పుడు తమిళే ఆమెకు మెయిన్ టార్గెట్ అయిపోయింది.

    ఇప్పటికే తెలుగులో ‘దొరసాని’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించినా ఎందుకో ఆమెకి పెద్దగా క్రేజ్ రాలేదు. అలాగే అవకాశాలు కూడా ఇబ్బడిముబ్బడిగా రాలేదు. కృష్ణవంశీ తీస్తున్న ‘రంగ మార్తాండ’లో కూడా ఒక చిన్న పాత్ర దక్కింది. కనీసం తమిళ సినిమాలతోనైనా స్టార్ డమ్ తెచ్చుకుంటే తెలుగులోనూ డిమాండ్ పెరుగుతుంది.