https://oktelugu.com/

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ విద్యార్థిని మృతి

ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత ఎంఎస్ చదివేందుకు గత ఏడాది ఆస్ట్రేలియా వెళ్లారు. గత గురువారం సిడ్నీలో ఆమె బైక్ పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రక్షిత మరణించారు. ఆమె మృతదేహానికి ఇక్కడికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షిత మృతితో తెలంగాణలోని ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తల్లదండ్రులు వెంకట్ రెడ్డి, అనిత […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 2, 2021 / 11:07 AM IST

    deadbody

    Follow us on

    ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత ఎంఎస్ చదివేందుకు గత ఏడాది ఆస్ట్రేలియా వెళ్లారు. గత గురువారం సిడ్నీలో ఆమె బైక్ పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రక్షిత మరణించారు. ఆమె మృతదేహానికి ఇక్కడికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షిత మృతితో తెలంగాణలోని ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తల్లదండ్రులు వెంకట్ రెడ్డి, అనిత కన్నీటి పర్యంతమవుతున్నారు.