ఆ ఎఫెక్ట్‌ జగన్‌ లేఖ వల్లేనా..?

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రాన్స్‌ఫర్‌‌ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. జడ్జి ట్రాన్స్‌ఫర్‌‌ వెనుక రకరకాల కథలు.. కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రచురించిన కథనం మరింత చర్చకు దారితీసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌‌ రిటైర్మెంట్‌ సమయంలో ఇచ్చిన తీర్పు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు.. న్యాయవ్యవస్థపై ఆయన వైఖరి వెల్లడించిన వ్యవహారం న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. Also Read: విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. నిఘా ఏం చేస్తోంది..? […]

Written By: Srinivas, Updated On : January 2, 2021 11:01 am
Follow us on


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రాన్స్‌ఫర్‌‌ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. జడ్జి ట్రాన్స్‌ఫర్‌‌ వెనుక రకరకాల కథలు.. కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రచురించిన కథనం మరింత చర్చకు దారితీసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌‌ రిటైర్మెంట్‌ సమయంలో ఇచ్చిన తీర్పు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు.. న్యాయవ్యవస్థపై ఆయన వైఖరి వెల్లడించిన వ్యవహారం న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

Also Read: విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. నిఘా ఏం చేస్తోంది..?

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్‌గా తీసుకున్నారని అందుకే.. ఏపీ హైకోర్టు సీజేఐని సిక్కింకి బదిలీ చేశారని పేర్కొంది. అంతే కాదు.. సీఎం జగన్ రాసిన లేఖను ఫిర్యాదు రూపంలో అఫిడవిట్‌లా చేసి పంపాలని కూడా జగన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ బోబ్డే కోరినట్లుగా ఆ పత్రిక తెలిపింది. జగన్ చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకునే అనేక విధాలుగా సమాచారం తెప్పించుకున్నారని.. సీజేఐ బోబ్డే తర్వాత సీనియార్టీలో ఉన్న ఎన్వీరమణ.. హైకోర్టు రోస్టర్‌లో జోక్యం చేసుకున్నారన్న విషయంపైనా వివరాలు తెప్పించుకున్నారని తన కథనంలో చెప్పుకొచ్చింది.

అదే సమయంలో జస్టిస్ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి నుంచి వివరణ కూడా తీసుకున్నారని చెబుతున్నారు. అలాగే.. ఈ అంశంపై సీజేఐ తన సహచర న్యాయమూర్తులతో చర్చించారని కూడా కథనంలో పేర్కొన్నారు. నిజానికి ముఖ్యమంత్రి రాసిన లేఖను అఫిడవిట్ రూపంలో పంపాలని సీజేఐ వ్యక్తిగతంగా కోరరు. అధికారికంగానే కోరుతారు. అందువల్ల అది కాన్ఫిడెన్షియల్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే న్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బదిలీలు చేశారంటే ఆ విషయం కూడా గుప్పుమనకుండా ఉండదు. గతంలో అనేక సందర్భాల్లో బయటకు వచ్చాయి. సుప్రీంకోర్టు కొలిజీయం.. రొటీన్ ప్రక్రియలో భాగంగానే బదిలీలు చేసిందని న్యాయవాద వర్గాలు నమ్ముతున్నాయి.

Also Read: జగన్‌కు ఇది బూస్టింగ్‌ పాయింటే..: ఇక అదొక్కటే టెన్షన్‌

కానీ.. జగన్‌ రాసిన లేఖ వల్లనే బదిలీలు చేశారని.. అలాంటి అభిప్రాయం బలంగా కల్పించడానికి కొన్ని మీడియా సంస్థల ద్వారా ప్రయత్నిస్తున్నారని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కథనంలో నిజానిజాలుంటే బయటపడటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఎందుకంటే.. కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద.. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఫిర్యాదు రూపంలో అఫిడవిట్ పంపాలని కోరడం గోప్యంగా ఉంచగలిగేంత చిన్న విషయం కాదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్