అమ్మఒడి పథకంలో చేరేవారికి అలర్ట్.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నవరత్నాల అమలులో భాగంగా ఎన్నికల ముందు అమ్మఒడి స్కీమ్ ను ప్రకటించి ప్రస్తుతం ఆ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది తొలి విడత జాబితా ప్రకటించి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో జగన్ సర్కార్ నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ రెండో విడత నగదును కూడా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ కానుంది. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు […]

Written By: Navya, Updated On : January 2, 2021 11:28 am
Follow us on


ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నవరత్నాల అమలులో భాగంగా ఎన్నికల ముందు అమ్మఒడి స్కీమ్ ను ప్రకటించి ప్రస్తుతం ఆ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది తొలి విడత జాబితా ప్రకటించి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో జగన్ సర్కార్ నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ రెండో విడత నగదును కూడా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ కానుంది. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

Also Read: ఆ ఎఫెక్ట్‌ జగన్‌ లేఖ వల్లేనా..?

43 లక్షల మంది తల్లుల ఖాతాలలో అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన నగదు జమ కానుంది. జగన్ సర్కార్ రెండో విడత అమ్మఒడి స్కీమ్ నగదును ఈ నెల 9వ తేదీన జమ చేయనుండగా 6450 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు కోసం ఖర్చు చేయనుంది. గతేడాది అమ్మఒడి స్కీమ్ కు అర్హత పొందిన వాళ్లు ఈ ఏడాది కూడా ఈ స్కీమ్ కు అర్హత పొందుతారని జగన్ సర్కార్ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది.

Also Read: విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. నిఘా ఏం చేస్తోంది..?

మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 5వ తేదీ వరకు అమ్మఒడి స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తులో మార్పులుచేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు సైతం అమ్మఒడి స్కీమ్ కు అర్హులే. జనవరి నెల 6వ తేదీన అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన చివరి జాబితా విడుదల కానుంది. తుది జాబితాలో పేర్లు ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అమ్మఒడి స్కీమ్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే గ్రామ, వార్డ్ వాలంటీర్లు లేదా గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా తెలుసుకోవచ్చు. 1వ తరగతి నుంచి పదవ తరగతి, ఇంటర్ చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు అమ్మఒడి స్కీమ్ లో చేరేందుకు అర్హులు.