Sreeleela Remuneration:ఒక స్టార్ హీరోయిన్ చిన్న సినిమా లో హీరోయిన్ గా నటించడానికి ఎలా ఒప్పుకుంది అని ఆ హీరోయిన్ కి సంబంధించిన అభిమానులు అనుకోవడం సహజం. కానీ అలా ఒప్పుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాకే సమంత ని హీరోయిన్ గా పెట్టుకోవడం, తమన్నా తో ఐటెం సాంగ్ పెట్టించడం అప్పట్లో ఒక సంచలనం. అందరూ దీని గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి అరుదైన అద్భుతమే జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. ఈయన రాజకీయంగా ఎంతో సంపాదించాడు, చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయనుకోండి అది వేరే విషయం. ఈయన కుమారుడు కిరీటి రెడ్డి(Kireeti Reddy) ఇప్పుడు హీరో గా ‘జూనియర్'(Junior Movie) అనే చిత్రం చేశాడు. ఈ సినిమా ఈ నెల 18 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది.
Also Read: ఎన్టీఆర్ వార్ 2 vs రజినీకాంత్ కూలీ…వీటిలో విజయం ఎవరిది..?
ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల(Sreeleela) నటిస్తుంది. నవీన్ పోలిశెట్టి(Naveen Polisetty) , అఖిల్ అక్కినేని(Akkineni Akhil) వంటి హీరోలకు కూడా డేట్స్ సర్దుబాటు చేయలేక వాళ్ళ సినిమాల నుండి మధ్యలోనే తప్పుకున్న శ్రీలీల, ముక్కు మొహం కూడా తెలియని హీరో సినిమా చేయడం ఏంటి?, అది కూడా ఆమె ప్రొమోషన్స్ లో చాలా చుర్రుగా కూడా పాల్గొంటుంది అంటూ ఆమె ని అభిమానించే వాళ్ళు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఈ చిత్రం చేయడానికి గల ముఖ్య కారణం రెమ్యూనరేషన్. సినిమా విడుదలకు ముందే నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అడ్వాన్స్ గా ఇచ్చారట.దానితో పాటు ఒక ఖరీదైన కారు కూడా. ఇక చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు లేయ్యమంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తో ఒక మీడియం రేంజ్ సినిమాని తీసేయొచ్చు.
Also Read: మహేష్ బాబు కోసం అంత పెద్ద త్యాగం చేసిన రాజమౌళి…
డబ్బులు భారీ గా ఉంటే మీరు కూడా ఒక సినిమా తీసి అందులో శ్రీలీల పక్కన నటించే ఛాన్స్ కొట్టేయొచ్చు, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇకపోతే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని అందించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన ‘వైరల్ వయ్యారి’ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ సాంగ్ నే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ లోని స్టెప్పులను అనుకరిస్తూ రీల్స్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఈ పాట ఇంత వైరల్ అవుతుందని మూవీ టీం కూడా ఊహించి. శ్రీలీల కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రొమోషన్స్ లో పాట ని బాగా ప్రమోట్ చేస్తుంది. ఇంతలా ప్రమోట్ చేస్తున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.