Nandamuri Heroes 2026 Movies : 2025వ సంవత్సరంలో చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించినప్పటికి స్టార్ హీరోలకు మాత్రం ఈ ఇయర్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ హీరోలైతే 2025లో ఆశించిన మేరకు విజయాలను సాధించలేకపోయారు. బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘డాకు మహారాజ్’ హిట్ అయినప్పటికి భారీ సక్సెస్ ని మాత్రం సాధించలేకపోయింది. ఇక ఇయర్ ఎండింగ్ లో వచ్చిన ‘అఖండ 2’ సినిమా ప్లాప్ ను మూట గట్టుకుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటివరకు ప్లాప్ అనేది లేదు. కానీ ‘అఖండ 2’ సినిమా మాత్రం ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘వార్ 2’ సినిమా సైతం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికి ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ తేలిపోయిందనే చెప్పాలి.
పెద్దగా ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ఎన్టీఆర్ తన పాత్రతో విమర్శలను కూడా మూట గట్టుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వరుసగా 7 విజయాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ఫ్లాప్ అయితే వచ్చిందనే చెప్పాలి… ఇక కళ్యాణ్ రామ్ సైతం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సైతం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విపరీతంగా నిరాశపరిచిందనే చెప్పాలి.
కథలో వైవిధ్యం లేకపోయిన కూడా కథనంలో కొత్తదనాన్ని చూపిస్తే సినిమా బాగుండేది. కానీ దర్శకుడు అటు కథ ఇటు కథనం రెండింటిలో ఫెయిల్ అయిపోయాడనే చెప్పాలి. నందమూరి ఫ్యామిలీ 2026వ సంవత్సరంలో సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం మిగతా వాళ్లతో పోలిస్తే వీళ్ళు చాలా వెనకబడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఎలాగైనా సరే ఈ సంవత్సరం బాలయ్య బాబు ఒక భారీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందుకే గోపీచంద్ మలినేని సినిమాను వీలైనంత తొందరగా ఫినిష్ చేసి ఇయర్ ఎండింగ్ వరకు తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు… అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… కళ్యాణ్ రామ్ కూడా ఈ ఇయర్ చివర్లో వచ్చి మంచి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు…