Sobhita Dhulipala
Sobhita Dhulipala: స్టైలింగ్ లో సమంత(Samantha Ruth Prabhu) రూటే వేరు. ఈమె ధరించే దుస్తులు చాలా వెరైటీ గా, స్టైలిష్ గా ఉంటాయి. ముఖ్యంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు ఆమె తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో షూట్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈమె ధరించే దుస్తులను అభిమానులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అభిమానులు అన్నాక ఆ మాత్రం ఉంటుంది. కానీ కొంతమంది హీరోయిన్స్ కూడా సమంత స్టైలింగ్ ని గుడ్డిగా అనుసరిస్తున్నారు. ఆమె ధరించిన దుస్తులను ఆర్డర్ చేయించి మరీ డిజైన్ చేసుకుంటున్నారు. వారిలో ప్రముఖ యంగ్ హీరోయిన్, నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) సతీమణి శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) కూడా ఉందని రీసెంట్ గా విడుదలైన ఒక వీడియో ని చూసిన తర్వాత అర్థమైంది. సమంత ధరించిన దుస్తులు, ఆ వీడియో లో శోభిత ధరించిన దుస్తులు రెండు ఒకేలా ఉన్నాయి.
Also Read: కన్నప్ప మూవీ పై ట్రోల్స్ చేస్తే సర్వ నాశనమైపోతారు – మూవీ టీం
పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇటీవలే ఆమె వోగ్ మ్యాగజైన్ కి నాగ చైతన్య తో కలిసి ఒక ఫోటో షూట్ చేసింది. అందులో ఆమె అఖ్ల్ బ్రాండ్ కి సంబంధించిన వెండి రంగు టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది. దీని ధర అక్షరాలా 49,593 రూపాయిలు. ఇంతటి స్టైలిష్ దుస్తులు ధరించినప్పటికీ, ఆమె చాలా సింపుల్ మేకప్ లో ఈ ఫోటో షూట్ లో దర్శనమివ్వడం గమనార్హం. సరిగ్గా సమంత కూడా రెండు నెలల క్రితం స్టూడియో మూన్ రే నుండి తయారైన ఓంబ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ డ్రెస్ ని ధరించింది. పేర్లు వేరైనా చూసేందుకు ఈ రెండు డ్రస్సులు ఒకేలా ఉండడంతో సమంత ని చూసి శోభిత కూడా తన కాస్ట్యూమ్ ని అలా డిజైన్ చేయించుకుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
నాగ చైతన్య తో పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు కొన్నాళ్ళు దూరంగా ఉండబోతుందని తెలుస్తుంది. పెళ్ళికి ముందే ఆమె తాను ఒప్పుకున్నా కమిట్మెంట్స్ ని మొత్తం పూర్తి చేసుకుంది. తెలుగు లో శోభిత గూఢచారి, మేజర్ వంటి చిత్రాలు చేసింది. ఎక్కువ శాతం ఆమె హిందీ లోనే సినిమాలు చేసింది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఇక సమంత విషయానికి వస్తే గత కొంతకాలంగా ఈమె అనారోగ్య సమస్యలతో సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కోలుకోవడంతో సినిమా షూటింగ్స్ తో నెమ్మదిగా బిజీ అవుతుంది. ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు చేస్తున్న సమంత, నెట్ ఫ్లిక్స్ లో ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.