https://oktelugu.com/

Kannappa: కన్నప్ప మూవీ పై ట్రోల్స్ చేస్తే సర్వ నాశనమైపోతారు – మూవీ టీం

Kannappa నేడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు, శివ బాలాజీ, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

Written By: , Updated On : March 24, 2025 / 02:37 PM IST
Kannappa (2)

Kannappa (2)

Follow us on

Kannappa: ఒక సినిమా బాగుంటే హీరో ఎవరు అనేది కూడా చూడకుండా, ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తున్న రోజులివి. సినిమా బాగుంటే పొగుడుతారు, బాగాలేకపోతే అదే స్థాయిలో విమర్శిస్తారు. కానీ మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప మూవీ(Kannappa Movie) టీం మాత్రం మా సినిమా పై ట్రోల్స్ వేస్తే మట్టి కొట్టుకుపోతారు, నాశనమైపోతారు అంటూ విడుదల నెల రోజులకు ముందు నుండి శాపనార్ధాలు పెడుతున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు, శివ బాలాజీ, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ ‘ ఈ సినిమా గురించి ఎవరైన ట్రోల్ చేశారంటే శివుడి ఆగ్రహానికి, ఆయన శాపానికి గురి అవుతారు. గుర్తుపెట్టుకోండి, అది ఎవరైన సరే నూటికి నూరు శాతం మీ జీవితం ఫినిష్’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: ఐ డ్రీమ్ థంబ్ నైల్ పరాకాష్ట.. ఇచ్చి పడేసిన గాయత్రి భార్గవి..

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతున్నాయి. ఇదెక్కడి విడ్డూరం, సినిమా బాగుంటే బాగుందని చెప్తారు, బాగాలేకపోతే బాగాలేదు అని చెప్పడం తప్పా?, అందుకు శివుడు ఆగ్రహిస్తాడా?, మా సినిమా దయచేసి చూడండి అని ప్రేక్షకులను అడిగే బదులుగా, ఇలా బెదిరిస్తారా?, ఇదో కొత్త తరహా పబ్లిసిటీ నా?, ఇలాంటి కామెంట్స్ చేస్తే ట్రోల్స్ చేయకుండా ఎందుకు ఉంటారు?. మంచు విష్ణు నటన బాగుంటే ఒకప్పుడు ఆయన్ని తీవ్రంగా విమర్శించినా వాళ్ళే పొగుడుతారు. రెండు టీజర్స్, మూడు పాటలు విడుదల అయ్యాయి. వీటిలో మంచు విష్ణు ని చూస్తే తన నట బీభత్సాన్ని చూపించినట్టు అందరికీ అనిపించింది. వాటికి యూత్ ఆడియన్స్ ట్రోల్స్ చేయకుండా ఎలా ఉంటారు మీరే చెప్పండి. పైగా విష్ణు అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో, ప్రెస్ మీట్స్ లో మాట్లాడే మాటలను చూస్తే ఎవరికైనా నవ్వు రాకుండా ఉంటుందా?.

ఈ చిత్రం లో ప్రభాస్(Rebelstar Prabhas) లాంటి సూపర్ స్టార్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. అదే విధంగా అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohanlal) లాంటి ఇతర భాషలకు సంబంధించిన సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడలేకపోతుందంటే అందుకు మంచు విష్ణు అన్న ఫ్యాక్టర్ లేదు అని ఎవరైన చెప్పగలరా?. ఎంతో అద్భుతమైన కంపొజిషన్ తో స్వరపరిచిన సాంబశివ పాటలో విష్ణు అన్న అభినయాన్ని చూసి కూడా ట్రోల్స్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు వచ్చే ప్రతీ పైసా ప్రభాస్ పేరు మీద రావాల్సిందే. ఆయన తరుపున వచ్చే ఆడియన్స్ ని కూడా ఇలాంటి మాటలతో రానివ్వకుండా చేసేలా ఉన్నారు. ప్రేక్షకులను శపించడం మానేసి, కంటెంట్ మీద నమ్మకం పెట్టుకుంటే బాగుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.