https://oktelugu.com/

Raja Saab: ‘రాజా సాబ్’ టీజర్ రెడీ..ఇది కేవలం హర్రర్ థ్రిల్లర్ మాత్రమే కాదండోయ్!

Raja Saab హర్రర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, మారుతీ మార్క్ కామెడీ టైమింగ్ డైలాగ్స్ కూడా గట్టిగానే పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ లో ఉండే ఒక డైలాగ్ ని ఈ టీజర్ లో ప్రభాస్ నోటి నుండి పలికించారట.

Written By: , Updated On : March 24, 2025 / 03:06 PM IST
Raja Saab

Raja Saab

Follow us on

Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘రాజా సాబ్'(Raja Saab Movie). అత్యధిక శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రమిదే. కానీ కొన్ని VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా పడింది, లేకుంటే ఏప్రిల్ 10 న విడుదల అయ్యేది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఉగాది రోజుల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. డైరెక్టర్ మారుతి(Director Maruthi) ఇప్పటికే టీజర్ కట్ ని రెడీ చేసి దానికి సంబంధించిన రఫ్ కట్ ని ఇండస్ట్రీ లోని తన సన్నిహితులకు చూపించాడట. ఈ టీజర్ ని చూసిన తర్వాత వాళ్ళ నోటి నుండి వచ్చిన మాట ఏమిటంటే ‘ప్రభాస్ ని ఇలా కూడా చూపించవచ్చా, ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ ప్రయోగం చేయలేదు, శబాష్’ అని అన్నారట.

Also Read: కన్నప్ప మూవీ పై ట్రోల్స్ చేస్తే సర్వ నాశనమైపోతారు – మూవీ టీం

హర్రర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, మారుతీ మార్క్ కామెడీ టైమింగ్ డైలాగ్స్ కూడా గట్టిగానే పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ లో ఉండే ఒక డైలాగ్ ని ఈ టీజర్ లో ప్రభాస్ నోటి నుండి పలికించారట. ఇది ప్రభాస్ అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో ఉండిఉందని టాక్. అంతే కాకుండా ప్రభాస్ ని లుక్స్ పరంగా కూడా అద్భుతంగా చూపించారట. ఇప్పటి వరకు ఈ సినిమాకు హారర్ కామెడీ జానర్ మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ టీజర్ లో అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్ట్ ని ఒకటి రివీల్ చేయబోతున్నారట. మొత్తం మీద టీజర్ ఒక విజువల్ ట్రీట్ గా ఉండబోతుందని టాక్. మారుతీ లో ఇంత టాలెంట్ ఉందా?, ప్రభాస్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఒకటి దాగి ఉందా అని ఆయన అభిమానులు కూడా సరప్రైజ్ అయ్యే విధంగా ఉంటుందట.

ఈ టీజర్ లో అందరూ ప్రత్యేకించి ఒక షాట్ గురించి మాట్లాడుకుంటారట. ఆ షాట్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్, స్టైల్, డ్యాన్స్ స్టెప్ కూడా ఉంటుందని సమాచారం. మారుతీ టేకింగ్ కి సెల్యూట్ చేయకుండా ఉండలేరని అంటున్నారు. సినిమా విడుదల విషయం లో కాస్త జాప్యం జరగొచ్చు. కానీ ప్రభాస్ అభిమానులకు చాలా కాలం తర్వాత ఫుల్ మీల్స్ ఉన్న సినిమా రాబోతుందని అంటున్నారు. అంత అద్భుతంగా ఈ సినిమా వచ్చిందట. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తుండగా, తమన్ సంగీతం అందించనున్నాడు. సినిమా ప్రారంభమై చాలా రోజులైంది, తమన్ అందించిన ట్యూన్స్ కూడా అవుట్ డేటెడ్ అయిపోయాయి అంట, మళ్ళీ ఫ్రెష్ గా ట్యూన్స్ ని కంపోజ్ చేస్తానని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.