Smart TV at Home: ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల పనులతో బిజీగా ఉన్నవారు.. రాత్రి ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొందరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి టీవీని చూస్తూ ఉంటారు. రాత్రి ఇంట్లోకి రాగానే వారికి నచ్చిన కార్యక్రమాలు లేదా సినిమాలు చూస్తూ గడిపేస్తారు. ఒకప్పుడు పోర్టబుల్ టీవీలు ఉండేవి. ఇవి ఏ మూలనో పెడితే దూరం నుంచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు HD క్వాలిటీతో బిగ్ స్క్రీన్లు వచ్చాయి. ఒక గదిలో ఒక గోడ వెడల్పు పాటు స్క్రీన్లు కూడా ఉంటున్నాయి. అయితే ఇది ఒక రకంగా మంచికే అయినా.. వీటిని దగ్గర నుంచి చూస్తే కళ్ళపై ప్రభావం ఉండే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మరి ఇలాంటి సమయంలో టీవీ ని ఎంత దూరం నుంచి చూడాలి?
Read Also: వీకెండ్ లో రెస్టారెంట్ కు వెళ్తున్నారా?
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ కచ్చితంగా ఉంటుంది. దీని నుంచి వెలువడే రంగులు కళ్లపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఒక్కో ఇంట్లో ఒక్కో టీవీ ఉంటుంది. ఆ టీవీకి అనుగుణంగా దూరం పెంచుతూ వీక్షించాలి. ఉదాహరణకు 55 ఇంచెస్ టీవీలను 82.5 నుంచి 110 అడుగుల దూరం నుంచి చూడాలి. 32 అడుగుల హెచ్డి టీవీని 80 నుంచి 96 అడుగుల దూరం నుంచి వీక్షించాలి. ఈ విషయంలో చిన్న పిల్లలు మరింత దూరం నుంచి చూస్తే ఎంతో మంచిది. అయితే కొందరి ఇళ్లల్లో స్పేస్ తక్కువగా ఉంటుంది. దీంతో టీవీ ని దగ్గర నుంచే చూడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా.. మధ్యలో లేస్తూ ఉండాలి. అలాగే ఒక గంట లేదా రెండు గంటలకు మించి టీవీని చూడకూడదని వైద్యులు తెలుపుతున్నారు. అలా గంటల తరబడి టీవీ ని చూస్తే కళ్ళపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని.. ముఖ్యంగా చిన్నపిల్లల కళ్ళపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని అంటున్నారు.
Read Also: ఈ మూడు నెంబర్లు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్..
టీవీని దగ్గర నుంచి చూడడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. ప్రధానంగా కళ్ళపై అలసట ఏర్పడుతుంది. దీంతో కళ్ళు మంటలు లేదా పొడిబారడం అనిపిస్తుంది. ఫలితంగా తలనొప్పి కూడా వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇళ్లల్లో స్మార్ట్ టీవీలు రకరకాల కలర్లతో కూడిన చిత్రాలు, వీడియోలు ప్రసారమవుతున్నాయి. ఇవి కంటి రెటీనా పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి స్క్రీన్ లను ఎక్కువసేపు చూడడం వల్ల దృష్టిలో మార్పు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే టీవీ స్క్రీన్ కూర్చున్న దానికంటే ఆరు రేట్లు ఎత్తులో ఉంచాలని.. వీటికి దూరంగా ఉంటే ఇంకా మంచిదని చెబుతున్నారు.
కొందరు టీవీలో సినిమాలు చూస్తూ అలాగే ఉండిపోతారు. ఇలా గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా.. మధ్యలో విరామం ఇస్తూ అటు ఇటు తిరగాలి. ఒకే వైపున దృష్టి ఉంచడం వల్ల కంటి చూపులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే రోజుల తరబడి టీవీ ని చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి.