Cyber Crime Alert: ఈ రోజుల్లో మొబైల్ లేని చేతులు కనిపించనే ఉండవు. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ తోనే గడిపేస్తున్నారు. కొందరు ఉద్యోగాలు, వ్యాపారాలు సైతం ఫోన్ తోనే చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఫోన్ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. కొందరు సైబర్ నేరగాళ్లు వినియోగదారుల డేటాను సేకరించడానికి ఈ ఫోన్లే ఆధారంగా ఉంటున్నాయి. అందువల్ల మొబైల్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలని కొందరు సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కోసారి మనకు తెలియకుండానే మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని విషయాలపై అవగాహన ఉండడంతో మనల్ని ఎవరు మోసం చేస్తున్నారో ముందే గుర్తించవచ్చు. ఇందుకోసం ఈ మూడు నెంబర్లను ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ఉండాలి. వీటిలో..
Also Read: డాక్టర్స్ రాసిన ప్రిస్క్రిప్షన్ అర్థం కావడం లేదా? అయితే వాట్సాప్ లో ఇలా చేయండి..
*#61#..
మొబైల్లో కాల్ బాక్స్ లో ఈ నెంబర్ను టైప్ చేయాలి. ఆ తర్వాత కాలింగ్ కొట్టాలి. ఇలా చేయడం వల్ల మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ ఎవరైనా కాల్ ఫార్వర్డ్ చేస్తే వారికి సంబంధించిన వివరాలు ఇందులో కనిపిస్తాయి. ఎవరు చేయకపోతే నో ఫౌండ్ అని మెసేజ్ వస్తుంది. ప్రస్తుత కాలంలో కాల్ ఫార్వర్డ్ తోనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకరి నుంచి డాటాను పొందేందుకు ఇలా కాల్ ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ నెంబర్ను డయల్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి.
##002#
ఒకవేళ మీ మొబైల్ ను ఎవరైనా కాల్ ఫార్వర్డ్ చేసినట్టు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కడో దూరాన ఉండేవారు మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఈ కాల్ ఫార్వార్డింగ్ ను డిఆక్టివేట్ చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు. అందువల్ల మొబైల్ లోని కాలింగ్ ఆప్షన్ లో ఈ నెంబర్ను డిలీట్ చేయడం వల్ల కాల్ ఫార్వర్డ్ డిఆక్టివేట్ అయిపోతుంది. దీంతో ఎవరు ఒకరి ఫోన్ నుంచి మరొక ఫోన్ కు కాల్ ను పొందే అవకాశం ఉండదు.
*#06#
ఇక ఈ నెంబర్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కోసారి మొబైల్ చోరీకి గురి అవుతూ ఉంటుంది. అయితే చోరీకి గురి అయిన మొబైల్ ను ప్రస్తుత కాలంలో పోలీసులు టెక్నాలజీ ద్వారా తొందరగా ట్రేస్ చేయగలుగుతున్నారు. ఇలా ట్రై చేయాలంటే ముందుగా ఫోన్ కు సంబంధించిన ఈఎంఐ అనే నెంబరు ద్వారానే సాధ్యమవుతుంది. అందువల్ల ముందుగానే ఈ నెంబర్ను సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. దీన్ని డయల్ చేయడం ద్వారా మొబైల్ కి సంబంధించిన ఈఎంఐ నెంబర్ వస్తుంది. ఆర్ నెంబర్ ను మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ఫార్వర్డ్ చేసి ఉంచుకోవడం వల్ల అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.
Also Read: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా?
ఇలా ఈ మూడు నెంబర్లు కచ్చితంగా గుర్తు పెట్టుకోవడం వల్ల మీ యొక్క మొబైల్ ను సేఫ్ గా ఉంచుకొనే అవకాశం ఉంటుంది.