Bigg Boss 9 Telugu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ప్రస్తుతం ఆయన పొలిటీషియన్ గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి రాబోయే రెండు సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. అయినప్పటికి ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజి’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటివరకు బాగానే ఉంది కానీ ఆయన చేస్తున్న ఓజీ సినిమా మీదనే ప్రతి ఒక్కరు చూపైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే టెలివిజన్ రంగంలో అతి పెద్ద షో గా మంచి పాపులారిటీని సంపాదించుకున్న బిగ్ బాస్ షో లోకి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అయిన బండ్ల గణేష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read: ‘బిగ్ బాస్ 9’ లో ఒక కాంటెస్టెంట్ కి వారంలో హైయెస్ట్ గా ఎంత పే చేయబోతున్నారో తెలుసా..?
అయితే బండ్ల గణేష్ కాంటెస్ట్ గా వస్తున్నాడా? లేదంటే ఒక్కరోజు గెస్ట్ గా వచ్చి వెళ్లిపోతాడా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఆయన ఈ సీజన్లో బిగ్ బాస్ లో దర్శనమివ్వబోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆయన కనక ఒక్కరోజు హౌస్ లో ఉన్నా కూడా రచ్చ రచ్చ జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే అతన్ని హౌజ్ లోకి తీసుకురావాలనే ప్రయత్నం అయితే చేశారు.
మరి మొత్తానికైతే ఆ ప్రయత్నం సఫలం అయింది అని కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా బండ్ల గణేష్ గెస్ట్ గా వచ్చి వెళ్ళిపోయినా కూడా ఆయన ఒక్కరోజు పాటు ప్రేక్షకుల్లో ఒక అలజడిని క్రియేట్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read: బిగ్ బాస్ 9 లో కాంటెస్టెంట్ గా రాబోతున్న ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో…
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 కోసం సామాన్య ప్రేక్షకులను సైతం అందులో భాగం చేయాలనే ఉద్దేశ్యంతోనే అగ్నిపరీక్ష పేరుతో ఒక షో ను నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇంకా దీనికి జడ్జిలుగా అభిజిత్, నవదీప్, బిందు మాధవి లు వ్యవహరించడం విశేషం…ఇక వచ్చే నెల ఏడోవ తేది నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వబోతుంది మరి దానికోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు సైతం ఆసక్తి ఎదురు చూస్తూ ఉండడం విశేషం…