Weekend Restaurant: ప్రతిరోజు ఇంట్లో వండిన ఆహారం కొందరికి బోర్ కొడుతూ ఉంటుంది. దీంతో వీకెండ్ సమయంలో లేదా కొన్ని ప్రత్యేక రోజుల్లో రెస్టారెంట్లలో భోజనం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి స్నేహితులతోనూ.. ఫ్యామిలీతోనూ ఇక్కడికి సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో లేని కొన్ని ప్రత్యేక వంటకాలు రెస్టారెంట్లలో లభిస్తాయి. అంతేకాకుండా ఇవి రుచిగా కూడా ఉంటాయి. దీంతో చాలామంది రెస్టారెంట్ ఆహారాన్ని లైక్ చేస్తూ ఉంటారు. అయితే రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. ఆహారం కల్తీ గా ఉండడమో లేదా కలుషితమైన నీరును ఉంచడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రెస్టారెంట్ వాళ్లు కొత్త రకంగా మోసం చేస్తున్నారు. అదేంటంటే?
Also Read: బిడ్డకు జన్మని ఇవ్వడం గొప్ప కాదట..ఇలాంటి మనుషులు కూడా ఉంటారా!
కొన్ని రెస్టారెంట్లలో వినియోగదారులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ సౌకర్యాలకు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి వినియోగదారుడికి మినిమం ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వకుండా వాటికి అదనంగా డబ్బులు లాగుతున్నారు. ఇటీవల కొన్ని రెస్టారెంట్లు వినియోగదారులకు ఆహారాన్ని అందించడంతోపాటు అదనంగా బాటిల్స్ ను అందిస్తూ వాటికి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
Food Safety And Standard Authority Of India (fssai) ప్రకారం రెస్టారెంట్లు వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలి. వీటిలో ఆహారాన్ని అందించిన తర్వాత ఉచితంగా నీటిని అందించాలి. అయితే కొన్ని రెస్టారెంట్లు ఈ నీటిని అందించకుండానే ప్రత్యేకంగా వాటర్ బాటిల్ ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వాటర్ బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.20 ఉంటే దానికి రూ.30 వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే కొందరు కచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకోవాలని అంటున్నారు.
అయితే ఏవైనా రెస్టారెంట్లో ఇలా వాటర్ బాటిల్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తేfssai toll free number 1800-112-100 నెంబర్ కు ఫోన్ చేయాలని కొందరు వినియోగదారుల ఫోరం ప్రతినిధులు తెలుపుతున్నారు. ఎఫ్ఎస్ఎస్ఐ ప్రకారం ప్రతి వినియోగదారుడికి రెస్టారెంట్లలో వాటర్ను ఉచితంగా ఇవ్వాలి. అయితే వినియోగదారుడు వాటిని తాగుతారా లేదా అనేది నిర్ణయించుకుంటారు. వారు ప్రత్యేకంగా వాటర్ బాటిల్ ను కోరుకుంటే మాత్రమే ఇవ్వాలి. అంతేకాకుండా ఒకవేళ వాటర్ బాటిల్ కావాలని అంటే ఎంఆర్పి ధరకు మాత్రమే విక్రయించాలి. కానీ చాలా రెస్టారెంట్లో ఈ మోసం జరుగుతోంది.
అంతేకాకుండా రెస్టారెంట్లలో ఆహారం తినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల వాతావరణం కలుషితం కావడంతో కొన్ని రెస్టారెంట్లలో కల్తీ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మాంసాహార ఆహారంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీనిపై ఎన్నో ఫిర్యాదులు రాగా అధికారులు సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే రుచికరమైన ఆహారాన్ని వండుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ బయటి రెస్టారెంట్లో తినాలని అనుకుంటే.. నాణ్యమైన రెస్టారెంట్ కు మాత్రమే వెళ్లాలి. లేకుంటే అనేక అనారోగ్యాల పాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు రెస్టారెంట్ ఫుడ్ అలవాటు చేయకుండా ఉండాలి. వీరిలో అనారోగ్యం త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.