https://oktelugu.com/

IND VS AUS 4th Test: మెల్ బోర్న్ టెస్టులో టీమిండియా మేనేజ్మెంట్ సంచలన నిర్ణయం.. జట్టులో కీలక మార్పులు

IND VS AUS 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా నాలుగో టెస్ట్ ఇంకాసేపట్లో షురూ కానుంది.. ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు నాలుగో టెస్ట్ ను నిర్వహిస్తారు. బాక్సింగ్ డే టెస్ట్ కావడంతో ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 25, 2024 / 10:05 PM IST
    Follow us on

    IND VS AUS 4th Test: ఆస్ట్రేలియా, భారత జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మెల్ బోర్న్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుత సిరీస్ లో రెండు జట్ల మధ్య మూడు మ్యాచులు జరిగాయి. పెర్త్ లో భారత్, అడిలైడ్ లో ఆస్ట్రేలియా గెలిచాయి. బ్రిస్ బేన్ లో మ్యాచ్ డ్రా గా  ముగిసింది. ఈ సిరీస్లో విజయం సాధించాలనుకున్నా, లేదా డ్రా గా ముగించుకోవాలనుకున్నా బాక్సింగ్ డే టెస్ట్ అత్యంత ముఖ్యం. అందువల్లే ఆస్ట్రేలియా, టీమిండియా ఈ మ్యాచ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారత్ ను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా పార్టీ ఇష్టమైన జట్టును ప్రకటించింది. హెడ్ ఈ మ్యాచ్ కు అందుబాటులోనే ఉంటాడు. మూడో టెస్ట్ అనంతరం అతడు గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. అతడు నాలుగో టెస్ట్ ఆడడని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ నిజాలు కావని..హెడ్ తుది జట్టులో ఉంటాడని ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది.. అయితే నాలుగో టెస్టులో మెక్ స్వీని చోటు కోల్పోయాడు. అతడి స్థానంలో కొత్త యువకుడు సామ్ కొన్ స్టాస్ చోటు దక్కించుకున్నాడు.. లబు షేన్, స్టీవ్ స్మిత్, హెడ్, కమిన్స్, స్టార్క్, లయన్, బోలాండ్ కు తొలి జట్టులో స్థానం దక్కింది. కొన్ స్టాస్, ఉస్మాన్ ఖవాజా తో కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొదలుపెడతాడు . కొన్ స్టాస్ కు ఇదే తొలి టెస్ట్.
    టీమిండియాలోనూ..
    ఆస్ట్రేలియా నే కాకుండా టీమ్ ఇండియాలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి..మెల్ బోర్న్ స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో వాషింగ్టన్ సుందర్ కు జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి చోటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్ విభాగాన్ని నడిపిస్తారు.. బుమ్రా, ఆకాశ్ దీప్,  మహమ్మద్ సిరాజ్ వంటి వారు పేస్ బౌలింగ్ దళాన్ని ముందుకు సాగిస్తారు. రోహిత్ శర్మ నాలుగో టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. రెండు, మూడు టెస్టులలో అతడు మిడిల్ ఆర్డర్ల బ్యాటింగ్ చేశాడు.. రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా రంగంలోకి దిగితే రాహుల్ మూడో స్థానంలోకి బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. ఓపెనర్ గా రాహుల్ విజయవంతమైనప్పటికీ.. రోహిత్ కోసం తన స్థానాన్ని వదులుకోవాల్సి రావచ్చు. గిల్, విరాట్ కోహ్లీ, పంత్ మిగతా స్థానంలో బ్యాటింగ్ చేస్తారు.
    టీమిండియా అంచనా ఇలా
    రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, బుమ్రా.