https://oktelugu.com/

YS Jagan : ఫొటో స్టోరీ : ఈ సీన్ కోసం వైసీపీ అభిమానులు ఎంత పరితపించారో?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డికి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ఆయన తనయుడు వైఎస్సార్‌ సీపీ పార్టీని స్థాపించి 2019 నుంచి 2024 వరకు సీఎంగా సేవలందించారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయింది. ఎన్నికల సమయం నుంచే వైఎస్సార్‌ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.

Written By:
  • Dharma
  • , Updated On : December 25, 2024 / 10:04 PM IST
    Follow us on

    YS Jagan : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనకు చిరునామాగా నిలిచారు. ఆయన కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పనిచేశారు. ఆయన మరణం తర్వాత ఆయన కొడుకు వైఎస్‌.జగన్‌తోపాటు కూతురు షర్మిల, తల్లి విజయమ్మ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. సొంత పార్టీ వైఎస్సార్‌సీపీ స్థాపించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ 67 ఎమ్మెల్యే సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు. ఇక 2019 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ కుటుంబ సభ్యులంతా కలిసి కట్టుగా ప్రచారం చేసి టీడీపీని ఓడించారు. దీంతో 151 సీట్ల భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అన్న జగన్‌, చెల్లి షర్మిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో 2021లోనే షర్మిల తెలంగాణకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంది. రెండేళ్లు పార్టీ బలోపేతానికి కష్టపడింది. కానీ, ఆదరణ లేకపోవడంతో 2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్‌ పగ్గాలు చేపట్టారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి అన్న చెల్లెలు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఆస్తి కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో విజయమ్మ కూడా తన కూతురును ఆదరించాలని కోరడంతో తల్లి, చెల్లి జగన్‌కు దూరమయ్యారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వైసీపీ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితమైంది.

    వాటా ఇస్తానని..
    జగన్‌ తన చెల్లెలుపై ప్రేమతో ఆస్తిలో తనకు వాటాగా వచ్చిన దాంట్లో కూడా కొంత ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే రాజకయ ప్రత్యర్థిగా మారడంతో తన వాటా ఇచ్చేది లేదని జగన్‌ తేల్చి చెప్పారు. దీనిపై జగన్‌ కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. పిటిషన్‌లో తల్లి విజయమ్మ పేరు కూడా ప్రస్తావించారు. ఆస్తి వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో ఆస్తుల వివాదంపై విజమ్మ లేఖ విడుదల చేశారు. అందులో కూతురు షర్మిలకే అండగా నిలిచారు. దీంతో కొడుకును విజయమ్మ పూర్తిగా పక్కన పెట్టందని వైఎస్సార్‌, జగన్‌ అభిమానులు ఆందోళన చెందారు. మళ్లీ అందరినీ కలిపి చూడాలని ఎదురు చూస్తున్నారు.

    క్రిస్మస్‌ వేడుకల్లో తల్లి కొడుకు..
    ఇదిలా ఉంటూ.. అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ​క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు జగన్‌ కడప వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి చర్చిలో జరిగిన ప్రార్థనల్లో జగన్‌తోపాటు విజయమ్మ పాల్గొన్నారు. తల్లి కొడుకు ఇద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి చేయి పట్టుకుని కేక్‌ కట్‌చేయించారు. విజయమ్మ కూడా కుమారుడిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో వైఎస్సార్‌, జగన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.