Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav Mumbai Indians Exit: ముంబై ఇండియన్స్ కు కటీఫ్ చెప్పిన సూర్య.. తర్వాత...

Suryakumar Yadav Mumbai Indians Exit: ముంబై ఇండియన్స్ కు కటీఫ్ చెప్పిన సూర్య.. తర్వాత జరిగేది అదేనా..

Suryakumar Yadav Mumbai Indians Exit: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు అంతగా ఆకట్టుకోలేదు. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. జట్టులో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మేనేజ్మెంట్ కొన్ని మ్యాచ్లకు పాండ్యాను దూరం పెట్టింది. సూర్య కుమార్ యాదవ్.. బుమ్రా కొన్ని మ్యాచ్లకు తాత్కాలిక నాయకత్వం వహించారు.

సూర్య కుమార్ యాదవ్ కూడా సరిగా ఆడలేదు. దీంతో మేనేజ్మెంట్ కూడా అతడి ఆట తీరు పట్ల అంతగా సంతృప్తిగా లేనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు సూర్య కుమార్ యాదవ్ ను కూడా వచ్చే సీజన్లో పక్కన పెడతారని.. మేనేజ్మెంట్ అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకుంటుందని ప్రచారం మొదలైంది. దీనిపై ముంబై యాజమాన్యం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ ఐపిఎల్ లో తన దారుణమైన ప్రదర్శనను కొనసాగించాడు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే అతడు.. కనీసం తన స్థాయిలో చెప్పుకునే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

సూర్య కుమార్ యాదవ్ ఇటీవల టీమిండియా టి20 జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. కెప్టెన్ హోదాను కోల్పోయాడు. ఆటగాడిగా కూడా అవకాశం పొందలేకపోయాడు. దీంతో అతనికి సంబంధించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ముంబై t20 లీగ్ లో కూడా అతడు తన స్థాయిలో ఆడలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో వస్తున్నాయి. తాజాగా అతడు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అండ్ ఫాలో చేసాడు.. ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన ఫోటోలు కూడా అతడి సోషల్ మీడియా ఖాతాలో కనిపించడం లేదు.

ముంబై జట్టుకు సారధిగా ఉన్న హార్థిక్ పాండ్యాతో సూర్యకుమార్ యాదవ్ కు ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. హార్థిక్ పాండ్యా కూడా ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా అలానే చేయడంతో.. ఇతడు కూడా ముంబై ఇండియన్స్ జట్టు నుంచి బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే సీజన్లో ముంబై జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని మేనేజ్మెంట్ దృడ నిశ్చయంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version