GT vs PBKS
GT vs PBKS : చివరి వరకు ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో గుజరాత్ జట్టుపై పంజాబ్ కింగ్స్ 11 జట్టు 11 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి వచ్చిన విజయ్ కుమార్ వైశాఖ్( Vijay Kumar vaishak), అర్ష్ దీప్ సింగ్(arshdeep Singh) అద్భుతంగా బౌలింగ్ చేశారు. పంజాబ్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. ఐదు వికెట్ల నష్టానికి 243 రన్స్ స్కోర్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( kings XI Punjab team captain Shreyas Iyer) 42 బంతుల్లో 97*పరుగులు చేశాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (47), శశాంక్ సింగ్ (44*) విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో వెళ్ళింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 3/30 అదరగొట్టాడు. రబాడ, రషీద్ ఖాన్ చెరువు వికెట్ దక్కించుకున్నారు.
Also Read : గుజరాత్ వర్సెస్ పంజాబ్.. ఉత్కంఠపోరులో ఎవరిదో విజయం?
పాపం గుజరాత్
244 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన గుజరాత్ జట్టు కు మెరుపు ఆరంభం లభించింది.. గుజరాత్ ఓపెనర్లు గిల్( Shubhman Gil), సాయి సుదర్శన్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్(33) మాక్స్ వెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ దశలో బట్లర్, సాయి సుదర్శన్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. బౌండరీల వర్షం కురిపించారు. అయితే ఈ దశలో గుజరాత్ జట్టు గెలిచే విధంగా కనిపించింది. సాయి సుదర్శన్(Sai Sudarshan) మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో అర్ష్ దీప్ సింగ్ అతడిని అవుట్ చేశాడు. అంతేకాదు 84 పరుగుల భాగస్వామ్యానికి శుభం కార్డు వేశాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రూథర్ఫోర్డ్ సహాయంతో బట్లర్ గుజరాత్ జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ దశలో బట్లర్ ను జాన్సెన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతేకాదు మూడో వికెట్ కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. పంజాబ్ జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విజయ్ కుమార్ వైశాఖ్.. అద్భుతమైన బంతులు వేసి గుజరాత్ జట్టు పరుగులను కట్టడి చేశాడు. వైడ్ యార్కర్లతో అత్యంత తెలివిగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు భవన్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడి బౌలింగ్ పంజాబ్ జట్టుకు విజయావకాశాలను కలిగించే లాగా చేసింది. మూడో ఓవర్ లో 18 పరుగులు ఇవ్వడంతో.. గుజరాత్ జట్టు విజయానికి చివరి ఓవర్లో 27 రన్స్ కావాల్సి వచ్చింది. అయితే తొలి బంతికే తేవాటియ అవుట్ అయ్యాడు. రెండో బంతిని రూథర్ఫోర్డ్ సిక్సర్ కొట్టాడు. అని అతడిని అర్ష్ దీప్ సింగ్ అవుట్ చేశాడు. చివరి బంతికి షారుఖ్ ఖాన్ సిక్స్ కొట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
Also Read : శశాంక్.. ఏం గుండె ధైర్యం.. ఓడిపోతున్న మ్యాచ్ ను ఒక్కడై గెలిపించాడు..