Rekhachitram: క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి మలయాళ చిత్రాలు బెస్ట్ చాయిస్ గా మారాయి. తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన చిత్రాలు ఆ పరిశ్రమ నుండి వస్తున్నాయి. దృశ్యం మూవీ క్రైమ్ థ్రిల్లర్స్ లో బెస్ట్ అని చెప్పాలి. ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశాడు. తమిళ్ లో కమల్, హిందీలో అజయ్ దేవ్ గణ్ నటించారు. ఒరిజినల్ లో మోహన్ లాల్ నటించారు. ఈ మధ్య కాలంలో విడుదలైన కిష్కిందకాండ, సూక్ష్మదర్శిని అలరించాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చి తెలుగు ఆడియన్స్ నుండి మంచి ఆదరణ దక్కించుకున్నాయి.
ఈ కోవలోకే వస్తుంది రేఖాచిత్రం. జనవరిలో విడుదలైన ఈ సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ మాలీవుడ్ లో కాసులు వర్షం కురిపించింది. రేఖాచిత్రం మూవీ బడ్జెట్ కేవలం రూ. 6-9 కోట్లు అట. ఆ మూవీ ఫుల్ రన్ లో రూ. 50 కోట్లకు పైగా రాబట్టింది. పెట్టుబడికి ఐదారు రెట్ల వసూళ్లు రాబట్టింది. రేఖాచిత్రం డిజిటల్ రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. మార్చ్ 7 నుండి రేఖాచిత్రం స్ట్రీమ్ అవుతుంది. అడుగడునా ఉత్కఠతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ని అసలు మిస్ కావద్దు.
రేఖాచిత్రం చిత్రానికి జోఫీన్ టి చకో దర్శకత్వం వహించాడు. అసిఫ్ అలీ ప్రధాన పాత్ర చేశాడు. అనశ్వర రాజన్ మరో ప్రధాన పాత్ర చేసింది. మమ్ముటి గెస్ట్ అప్పరెన్సు ఇచ్చాడు. ఆయన నటుడిగా నిజ జీవిత పాత్రలో కనిపిస్తాడు. మనోజ్ కే జయన్ కీలక పాత్ర చేశాడు. థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి రేఖాచిత్రం బెస్ట్ చాయిస్.
రేఖాచిత్రం కథ విషయానికి వస్తే.. సీఐ గోపినాధ్(అసిఫ్ అలీ) వ్యక్తిగత కారణాల వలన సస్పెన్షన్ కి గురి అవుతాడు. కొన్నినెలల తర్వాత సస్పెన్షన్ ముగియడంతో విధుల్లో చేరతాడు. అతనికి 40 ఏళ్లుగా సాల్వ్ కానీ ఒక ఇంపార్టెంట్ కేసును అప్పగిస్తాడు. ఆ కేసును ఛేదించే క్రమంలో గోపినాధ్ కి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి గోపినాధ్ ఆ కేసును ఎలా పరిష్కరించాడు అనేది కథ..
Also Read : సమంత క్రేజీ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లో మీర్జాపూర్ నటుడు… అంచనాలు పెంచేసిన అలీ ఫజల్ కామెంట్స్
என்ன இந்த படத்துக்கு பெரிய ஹைப் ஓடிட்டு ட்விட்டர்ல
அவ்வளவு நல்லா இருக்கா இல்ல வழக்கம்போல மலையாள சினிமா என்பதால வர ஹைப் அஹ்? pic.twitter.com/NuMsbjOUgj
— Vinoth Kumar (@TalkiesFriday) March 6, 2025