Ravindra Jadeja match: క్రికెట్లో కొంతమంది ఆటగాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. వాళ్లు బౌలింగ్ చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. బ్యాటింగ్ చేస్తుంటే అమితానందం కలుగుతుంది. ఫీల్డింగ్ చేస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందువల్లే ఆటగాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. వారిలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ముందు వరసలో ఉంటాడు. అతడు బౌలింగ్ చేస్తాడు. బ్యాటింగ్ చేస్తాడు. ఫీల్డింగ్ కూడా చేస్తాడు. ఈ మూడు విభాగాలలో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయడు. వమ్ము చేయాలని అనుకోడు. ఎందుకంటే అతడిది భిన్నమైన శైలి. భిన్నమైన ఆట తీరు.
రవీంద్ర జడేజాను జడ్డు అని పిలుస్తుంటారు. ఆ పేరుకు తగ్గట్టుగానే అతడి ఆట తీరు ఉంటుంది. కష్టకాలంలో జట్టును ఆదుకునే తీరు అతడి నేర్పరితనాన్ని ప్రదర్శిస్తుంది. ఒంటి చేత్తో విజయాన్ని అందించే అతడి దృక్పథం చప్పట్లు కొట్టిస్తుంది. వేగంగా దూసుకు వచ్చే బంతిని అమాంతం ఆపే అతడి చాకచక్యం అభినందించేలా చేస్తుంది. అందువల్లే చాలా సంవత్సరాలుగా అతడు క్రికెట్ ఆడుతున్నాడు. ఏనాడు కూడా తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని… అంచనాలను తలకిందులు చేయలేదు. పైగా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. నిరూపించుకుంటూనే ఉన్నాడు.
Also Read: నితీశ్ మ్యాజిక్.. ఇంగ్లాండ్ కు షాక్
ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. బంతితో మ్యాజిక్ చేస్తున్నప్పటికీ.. బ్యాట్ ద్వారా దుమ్ము రేపు తున్నాడు. రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో.. రెండవ ఇన్నింగ్స్ లో తన బ్యాట్ నుంచి అద్భుతంగా పరుగులు చేశాడు. ఆ పరుగుల ద్వారా టీమ్ ఇండియాను అత్యంత పటిష్ట స్థితిలో జడ్డు నిలిపాడు. తద్వారా జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేకాదు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కృషి చేశాడు.
ప్రస్తుతం మూడో టెస్టులో కూడా జడ్డు విభిన్నంగా బౌలింగ్ చేస్తున్నాడు. పరుగులు ఇవ్వకుండా ఇంగ్లాండు బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఫీల్డింగ్ లో కూడా జెడ్ తన నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా మూడో టెస్ట్ తొలి రోజు మైదానంలో విభిన్నమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ లాంగ్ ఆన్ లో కొట్టిన బంతిని జడేజా ఆపాడు. అప్పటికే రూట్ 98 పరుగులు చేశాడు. లాంగ్ ఆన్ లోకి ఆడి రెండు పరుగులు తీసి సెంచరీ చేయాలని అనుకున్నాడు. కానీ ఈలోగా జడేజా ఆ బంతిని ఆపాడు. దీంతో డబుల్ తీయలేక రూట్ సింగల్ తోనే సరిపుచ్చుకున్నాడు.
Ravinder Jadeja challenged @root66 for rum. Absolutely comedy @BCCI #ENGvIND #RAVINDRAJADEJA #joeroot pic.twitter.com/FUTJBFP8wy
— Anuj Agnihotri (@anuj_agnihotri) July 10, 2025
ఈ నేపథ్యంలో బంతిని పట్టుకున్న జడేజా డబుల్ తీస్తావా?.. నేను బంతి విసిరేస్తాను చూస్తావా? అన్నట్టుగా సైగలు చేశాడు. దీంతో రూట్ సైలెంట్ అయిపోయాడు. సింగిల్ పరుగుతోనే సరిపుచ్చుకున్నాడు. అప్పటికి తొలి రోజు ఆట ముగియడంతో రూట్ 99 పరుగుల వద్ద నిలిచిపోయాడు. రూట్, జడేజా మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇదే సమయంలో జడేజాను అభిమానులు అభినందిస్తున్నారు. జడేజాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని ఇంగ్లాండ్ ప్లేయర్లను హెచ్చరిస్తున్నారు.
SIR JADEJA – WHAT A CHARACTER.
– Jaddu offering a double to Root so he can complete his hundred. pic.twitter.com/eqwJILrY9p
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 10, 2025