https://oktelugu.com/

Rama Mohan Rao Amara: ఎస్‌బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి.. ఏ జిల్లాకు చెందిన వారంటే?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా రామ మోహన్ రావు అమరాను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఈయన ఎండీ హోదాలో ఉండనున్నారు. తర్వాత మళ్లీ ఉత్తర్వులు వస్తే ఈ సమయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న కేబినెట్ నియామకాల కమిటీ తీసుకుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2024 / 03:46 PM IST

    Ram Mohan Rao amara

    Follow us on

    Rama Mohan Rao Amara: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా రామ మోహన్ రావు అమరాను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఈయన ఎండీ హోదాలో ఉండనున్నారు. తర్వాత మళ్లీ ఉత్తర్వులు వస్తే ఈ సమయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న కేబినెట్ నియామకాల కమిటీ తీసుకుంది. సెప్టెంబరులో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో ద్వారా ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. అయితే గతంలో సీఎస్‌ శెట్టి ఎండీగా విధులు నిర్వర్తించారు.

    ఇప్పుడు చైర్మన్‌గా పదోన్నతి పొందడంతో ఖాళీ అయ్యింది. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి రామ మోహన్ రావు అమరాను నియమించారు. రామ మోహన్ రావు ఇతను బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుతుంది. ఎస్‌బీఐ సంస్థ చైర్మన్‌ సి.ఎస్‌.శెట్టి కూడా తెలుగు వారే. ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగు వారు దక్కించుకోవడం ఎస్‌బీఐ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు అమరా పనిచేశారు. ఈయనకు బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా అనుభవం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో సిఫారసు చేస్తుంది.

    ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎఫ్‌ఎస్‌ఐబీ రామ మోహన్‌ రావు అమరాను ఎస్‌బీఐ ఎండీగా ప్రతిపాదించింది. అయితే ఎఫ్‌ఎస్‌ఐబీ చేసిన ప్రతిపాదనలే ఫిక్స్ కాదు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఈ ప్రతిపాదనలపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఎండీ పోస్టుకు ఎఫ్‌ఎస్‌ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. గుంటూరుకు చెందిన రామ మోహన్ రావు అమరా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1991లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బిఐలో బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. కేవలం దేశంలోనే కాకుండా విదేశాలలో క్రెడిట్, రిస్క్, అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో కూడా రామ మోహన్ రావుకి నైపుణ్యం ఉంది. గతంలో సింగపూర్‌, అమెరికాలో కూడా విధులు నిర్వర్తించారు. అలాగే చికాగో, కాలిఫోర్నియా ఎస్‌బీఐ బ్రాంచ్‌లకు ప్రెసిడెంట్‌గా, సీఈఓగా కూడా పనిచేసిన అనుభవం ఉంది.