https://oktelugu.com/

Vijay Deverakonda: అప్పుడు బయటపెడతా, రష్మిక తో ఎఫైర్ రూమర్స్ పై ఫైనల్లీ ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ!

రష్మిక మందానతో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నాడంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై విజయ్ దేవరకొండ స్పందించారు. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 19, 2024 / 03:49 PM IST

    Vijay Deverakonda

    Follow us on

    Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కెరీర్లో గీత గోవిందం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాతకు ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. విజయ్ దేవరకొండకు జంటగా రష్మిక మందాన నటించింది. గీత గోవిందం మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. సినిమా సక్సెస్ లో రొమాన్స్, లవ్ డ్రామా కీలకం అయ్యాయి. గీత గోవిందం అనంతరం డియర్ కామ్రేడ్ మూవీలో జంటగా నటించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ హద్దులు దాటేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ దగ్గరయ్యారనే వాదన ఉంది.

    విజయ్ దేవరకొండ, రష్మిక తరచుగా టూర్స్ కి వెళ్లడం మీడియాలో హైలెట్ అయ్యింది. పలుమార్లు మాల్దీవ్స్ వెకేషన్స్ కి వీరు వెళ్లారు. ఈ విషయాన్ని రష్మిక ఒప్పుకోవడం విశేషం. మేమిద్దరం మిత్రులం. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెకేషన్ కి వెళితే తప్పేంటి అన్నారు. ఇక విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి చిన్న వేడుకకు రష్మిక హాజరవుతుంది. పండగలు వాళ్లతో కలిసి జరుపుకుంటుంది.

    విజయ్ దేవరకొండ, రష్మిక ఘాడంగా ప్రేమించుకుంటున్నారని చెప్పడానికి ఇంత కన్నా రుజువులు ఏం కావాలనే వాదన ఉంది. కానీ ఈ జంట ఏనాడూ ఒప్పుకోలేదు. వ్ ఇంజె దేవరకొండ పరుష వ్యాఖ్యలతో ఖండించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి విజయ్ దేవరకొండను స్పష్టత కోరడమైంది. ప్రేయసితో మీ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయని అడగ్గా… నేను సిద్ధంగా ఉన్నప్పుడు, దానికి సమయం వచ్చినపుడు బహిర్గతం చేస్తాను. ఆ ఆరోజు వచ్చినప్పుడు సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలియజేస్తాను.

    నాకు పెళ్లి అంటూ తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి. నాకు ప్రతి ఏడాది మీడియా వివాహం చేసుకుంది. మనం పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు పుకార్లు సహజమే. నేను వాటిని పట్టించుకోను. ఒత్తిడి తీసుకోను. వార్తను వార్తలానే చూస్తాను. నా వృత్తిలో ఇది కూడా భాగమే. అపరిమితమైన ప్రేమ ఉంటుందో లేదో తెలియదు. ఒకరిని మనం ప్రేమిస్తున్నప్పుడు, బాధ్యత కూడా ఉంటుంది.. అంటూ చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు చెబుతున్నాన్న విజయ్ దేవరకొండ, మరోసారి మాట దాటేశాడు.

    రష్మిక మందాన వరుసగా పాన్ ఇండియా హిట్స్ కొడుతుంది. ఆమె నటించిన యానిమల్, పుష్ప 2 వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే… హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఆయన గత చిత్రం ది ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తో 12వ చిత్రం చేస్తున్నారు.