https://oktelugu.com/

Pushpa 50 Days Collections : 50 రోజుల్లో 350 కోట్లు.. పుష్పరాజ్ రేంజ్ ఇది !

Pushpa 50 Days Collections : ‘పుష్ప– ది రైజ్’ సినిమా  50 వ రోజు కలెక్షన్స్  విషయానికి వస్తే..  మొత్తానికి పుష్పరాజ్ సూపర్  హిట్ అనిపించాడు. కాగా  బ్లాక్‌ బస్టర్ మూవీ ‘పుష్ప’ రిలీజై నేటితో 50 రోజులు పూర్తయ్యాయి. ఈ 50  రోజుల్లో వరల్డ్  వైడ్‌ గా రికార్డు స్థాయిలో ఏకంగా రూ.365  కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 4, 2022 / 04:52 PM IST

    Pushpa Day 19 Collections

    Follow us on

    Pushpa 50 Days Collections : ‘పుష్ప– ది రైజ్’ సినిమా  50 వ రోజు కలెక్షన్స్  విషయానికి వస్తే..  మొత్తానికి పుష్పరాజ్ సూపర్  హిట్ అనిపించాడు. కాగా  బ్లాక్‌ బస్టర్ మూవీ ‘పుష్ప’ రిలీజై నేటితో 50 రోజులు పూర్తయ్యాయి. ఈ 50  రోజుల్లో వరల్డ్  వైడ్‌ గా రికార్డు స్థాయిలో ఏకంగా రూ.365  కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.   

    Allu Arjun OTT Movie

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌ గా సందడి చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ పార్ట్-2 కూడా రాబోతోంది.   నిజానికి ఇప్పటికే ఈ సినిమా  మొదటి పార్ట్  రెండు వారాల్లోనే  బ్రేక్ ఈవెన్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే, 50 వ రోజు కూడా ఈ సినిమాకు ఇంకా  కొన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి.   

    Pushpa 20 Days Collections

    వాస్తవానికి  మొదటి రోజు నుంచీ  ‘పుష్ప’ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.  అయితే ఆ తర్వాత  సినిమా బాగా పుంజుకుంది.   ‘పుష్ప’  అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.  50 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని  రూ.  350 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది అంటే.. గ్రేట్ అనే చెప్పాలి.  

    allu-arjun

    ఒక తెలుగు సినిమాకి  ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం రికార్డ్ అనే చెప్పాలి.  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ –  ‘ఐకాన్ స్టార్’  ‘అల్లు అర్జున్’   కలయికలో   అత్యంత ప్రతిష్టాత్మకంగా  పాన్ ఇండియా సినిమాగా  వచ్చిన  ఈ  సినిమా  అనూహ్యంగా  భారీ విజయాన్ని సాధించడంతో  ఇప్పుడు రానున్న పుష్ప 2 పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.