Owaisi Security: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెదుహాల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీపై ఉత్తర ప్రదేశ్ లో గురువారం కాల్పుల కలకలం చోటుచేసుకోవడంతో రాజకీయా పార్టీల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయన భద్రతపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. సాటి నాయకుడిగా ఆయన రక్షణ తమ బాధ్యతగా చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయనకు మరింత భద్రత కట్టుదిట్టం చేసే పనిలో నిమగ్నమైంది. ఆయనపై ఇప్పటికే పలుమార్లు దాడులు చోటుచేసుకోవడంతో ఆయన రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయిని చెబుతున్నారు.
యూపీలోని మీరట్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని కారులో బయలుదేరిన అసదుద్దీన్ ను నలుగురు అగంతకులు రోడ్డుపైనే దాడులకు తెగబడటం తెలిసిందే. దీంతో ఆయన భద్రతపై అందరిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ భద్రత గురించి అందరిలో భయం ఏర్పడటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే కేంద్ర హోంశాఖ ఆయన భద్రతకు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది.
దాడులకు పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సచిన్, శుభమ్ గా గుర్తించారు. వారు ఎందుకు దాడికి తెగబడ్డారు. అసదుద్దీన్ ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. వారిని విచారిస్తున్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది. ఎవరు చేయమన్నారు అనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో ఎవరి హస్తం ఉంది అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: టాటాల ‘స్వదేశీ’ మర్యాద.. అంతా ‘ఫిదా’
అసదుద్దీన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఆయన ప్రాణాలను రక్షించే క్రమంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కు చెందిన కమెంటోలు, ఇండో టిబెటన్ కు చెందిన 22 మంది కమెండోలతో ఆయన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇకపై ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.
మొత్తానికి అసదుద్దీన్ ఓవైసీకి భారీ భద్రత ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆయన ఇకపై స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. ఇన్నాళ్లు భద్రత లేకపోవడంతో ఆయనపై దాడులు జరిగిన సందర్భంలో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడంతో ఆయన ఇక భరోసాగా తిరిగే అవకాశం ఉంటుందని అందరు చెబుతున్నారు.
Also Read: పంజాబ్ లో సీఎం మేనల్లుడి అరెస్టుః ఏం జరుగుతోంది?