Tollywood Stars: సగటు సామాన్యుడు కనే కల సొంతిళ్లు. అందుకుగాను ఉద్యోగం చేసి ఎంతో కొంత వెనుకేసుకుని దానికి కొంత లోన్ తీసుకుని ఎలాగైనా సరే తన జీవిత కాలంలో సొంతిల్లు నిర్మించుకోవాలని అనుకుంటాడు. అలా ఇళ్లు కట్టుకుని తనకు నచ్చినట్లు జీవించాలని భావిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా అంతే కదా.. వాళ్లకున్న ఇమేజ్ ప్లస్ మనీ దృష్ట్యా హ్యాపీగా విలాసవంతమైన భవనాల్లో తమ జీవితం హ్యాపీగా ముందుకు తీసుకెళ్లొచ్చు. అలా గడుపుతున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు.. కానీ, వీరు మాత్రం సెపరేట్ అని చెప్పొచ్చు. వీరు తమకు రాజభవనం లాంటి ఇళ్లు ఉన్నప్పటికీ వాటిని వదిలిపెట్టి సాదా సీదా జీవితం గడుపుతున్నారు. వారు ఎవరెవరంటే..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఒక్క సినిమా చేస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. వాటితో విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవచ్చు కానీ, జనసేనాని అలా కాకుండా ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారు. అయితే, రాజకీయాలలోకి వచ్చాక పవన్.. అక్కడి నుంచి తన ఫామ్ హౌజ్ కు షిఫ్ట్ అయ్యారు. ఏపీలోని అమరావతిలో కూడా ఒక చిన్న ఇంటిని నిర్మించుకున్నారు.
స్టైలిష్ విలన్ జగపతిబాబు కూడా సాదా సీదాగా ఉంటారు. అపోలో దగ్గరలో ఆయనకు పెద్ద బంగ్లా ఉన్నప్పటికీ కూకట్ పల్లిలోని రోటా టవర్స్ లో ఓ ఫ్లాట్ లో జగపతి బాబు ఉంటున్నారు. కమెడియన్ ఆలీ కూడా అంతే.. ఆయనకు శ్రీనగర్ కాలనీలో పెద్ద బంగ్లా ఉన్నప్పటికీ మణికొండలోని ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఉంటున్నారు.
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి నివసించడానికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నప్పటికీ మణికొండలోని ఓ ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఉంటున్నాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా గచ్చి బౌలిలోని గేటెడ్ కమ్యూనిటీలోని ఓ చిన్న ఇంటిలో ఉంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జూబ్లీ హిల్స్ లో ఈయనకు రాజభవనం లాంటి ఇల్లు ఉంది. అయినప్పటికీ ఈయన జువెనేస్టిక్ కాలనీలోని ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటారు. అలా మొత్తంగా ఈ కొందరు సెలబ్రిటీలు హ్యాపీగా సాదా సీదా లైఫ్ గడిపేస్తున్నారు.
Also Read: ఆమెకు కరోనా పాజిటివ్.. అమితాబ్ పరిస్థితి ఏమిటి ?
Also Read: ‘విజయ్ దేవరకొండ, నాని’లను చూసే ‘రామ్’ భారీ యాక్షన్