HomeNewsDaggubati Purandeswari: రాజకీయాలకు దూరంగా చిన్నమ్మ.. పిలిచి మాట్లాడిన ప్రధాని

Daggubati Purandeswari: రాజకీయాలకు దూరంగా చిన్నమ్మ.. పిలిచి మాట్లాడిన ప్రధాని

Daggubati Purandeswari: బిజెపి ఎంపీ పురందేశ్వరి ( purantheswari) ఇటీవల ఏపీ పాలిటిక్స్ లో పెద్దగా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆమె క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. ఆమె కుమారుడు టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని టాక్ నడిచింది. మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు పురందేశ్వరి. కేంద్ర మంత్రి పదవి కూడా ఆశించారు. కానీ ఆమెకు అందకుండా పోయింది. అందుకే పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదన్న కామెంట్స్ వినిపించాయి. రాజమండ్రి పార్లమెంట్ స్థానం పరిధిలో అయితే ఎంపీ కనిపించడం లేదు అంటూ పోస్టర్లు కూడా అతికించారు. కానీ పురందేశ్వరి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల భర్త వెంకటేశ్వరరావుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. దీంతో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను బిజెపిలో కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు. ఆపై ఇప్పుడు ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది.

* బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా..
భారతీయ జనతా పార్టీలో( Bhartiya Janata Party) సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చారు పురందేశ్వరి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ మాదిరిగా బిజెపి వేగంగా గుర్తింపు ఇవ్వలేదు. దీంతో ఆమె అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఆమెకు ఇచ్చారు. వాస్తవానికి 2014లోనే ఆమె బిజెపి అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. టిడిపి తో పొత్తులో భాగంగా పోటీ చేసినప్పటికీ ఓటమి ఎదురైంది. అయినా సరే బిజెపిలో కొనసాగుతూ వచ్చిన ఆమెకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే ఆదిలో టిడిపి నాయకత్వం పట్ల వేరే ఆలోచనతో ఉండే పురందేశ్వరి.. మొన్నటి ఎన్నికల్లో మాత్రం టిడిపి పట్ల సానుకూలంగా వ్యవహరించారు. పొత్తులో కీలక భాగస్వామ్యం అయ్యారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పురందేశ్వరికి కేంద్రమంత్రి పదవి ఖాయమని ప్రచారం నడిచింది. కానీ వివిధ సమీకరణల్లో ఆ ఛాన్స్ దక్కలేదు. ఆమె జోడు పదవులు ఉన్న నేపథ్యంలో బిజెపి అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

* కాంగ్రెస్ తో కీలక పదవులు
పురందేశ్వరికి కేంద్రమంత్రి పదవి కొత్త కాదు. తెలుగుదేశం( Telugu Desam) పార్టీ నాయకత్వంతో విభేదించి ఆమె భర్త వెంకటేశ్వరరావు తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా 2004లో బాపట్ల ఎంపీ సీటును దక్కించుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2009లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బిజెపిలో చేరారు. 2024లో బిజెపి తరఫున గెలిచేసరికి ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే ఆ అవకాశం రాలేదు. అందుకే క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని పురందేశ్వరి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడిచింది. కానీ దానికి చిట్ పడింది ప్రధాని మోదీని కలవడం ద్వారా. అయితే ఈ విస్తరణలో పురందేశ్వరికి ఛాన్స్ తప్పకుండా వస్తుందని తెలుస్తోంది. అదే జరిగితే నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులు ఎంతో ఆనందపడతారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular