
సినిమా ఇండస్ట్రీలో రోజుకు కనీసం ఒకరిద్దరు ప్రముఖులు కరోనాకు బలి అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత రియాన్ ఇవాన్ స్టీపెన్ కరోనాతో కన్నుమూశాడు. కొద్ది రోజుల క్రితం ఆయన వైరస్ బారిన పడ్డారు. దాంతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ లో రియాక్ కు మంచి పేరు ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన ఇందుకీ జవానీ చిత్రాన్ని ఈయనే నిర్మించారు.