Putrada Ekadashi 2025: నేడు వైకుంఠ ఏకాదశితో పాటు పుత్రద ఏకాదశిని (Putrada Ekadasi) కూడా చాలా మంది జరుపుకుంటారు. ఈ రోజు ఎక్కువగా వైష్ణవులు ఉపవాసం (Fasting) ఆచరించి పూజను నిర్వహిస్తారు. ఈ పూజను(Puja) నిర్వహించడం వల్ల సంతానం లభిస్తుందని కొందరు నమ్ముతారు. అయితే ఈ పుత్రద ఏకాదశిని కుమారుడు (son) పుట్టాలని చేస్తారు. పుత్రదా అంటే హిందీలో పుత్రుడు అని అర్థం. కొడుకు కావాలనే దంపతులు ఈ ఏకాదశి (Putrada Ekadasi) రోజు ఎంతో భక్తితో పూజిస్తారు. నియమ నిష్టలు పాటించి అంకితభావంతో విష్ణుమూర్తిని పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారత దేశంలో ఈ పౌష్ పుత్రద ఏకాదశి జరుపుకుంటారు. అయితే నేడే ఈ పౌష పుత్రద ఏకాదశి పూజను అందరూ నిర్వహిస్తారు. ఈ రోజు ఉపవాసం ఆచరించి విష్ణువును(Sri maha Vishnuvu) పూజిస్తే గతంలో చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే సంతానం సమస్యలు(Infertility Issues), మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు పౌష శుక్ల పక్షం, ఉదయం 10.20 గంటల వరకు తిథి ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2:37 గంటల వరకు శుభ యోగం ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ మంది ఈ పౌష పుత్రద ఏకాదశి (Putrada Ekadasi) పూజను నిర్వహిస్తారు. అయితే ఈ పుత్రద ఏకాదశి (Putrada Ekadasi) కొన్ని రాశులకు మంచి జరగనుంది. ఈ రోజు వారికి అసలు తిరుగే ఉండదు. మరి ఆ రాశులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మేష రాశి
ఈ పుత్రదా ఏకాదశి నుంచి మేషరాశి వారికి మంచి జరగనుంది. ఇకపై అనుకున్న పనులు అన్ని జరుగుతాయి. వ్యాపారాలు చేపట్టినవి అన్ని కూడా లాభాలతోనే ఉంటాయి. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. విద్యార్థులకు మంచిగా ఉంటుంది. అనుకున్న పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. పనుల్లో అసలు ఆటంకం ఏర్పడదు. ఈ రాశి వారు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి. ఇకపై అంతా మంచి జరుగుతుంది. ఏ విషయంలో కూడా వీరికి ఇక ఓటమి అనేదే ఉండదు.
కన్యా రాశి
కన్యారాశి వారికి ఈ రోజు నుంచి అంతా మంచే జరుగుతుంది. అనుకున్న పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అన్ని విషయాలు కూడా శుభవార్తలు వింటారు. ఇంట్లో అందరితో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇక నుంచి ఈ రాశి వారికి అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి
నేటి నుంచి మీకు అన్ని మంచి రోజులు వచ్చినట్లే. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న గొడవలు క్లియర్ అయిపోతాయి. ఇకపై వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు వస్తుంటాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన కూడా ఎలాంటి ఆటంకులు ఉండవు. అంతా కూడా లాభాల్లోనే నడుస్తుందని పండితులు అంటున్నారు.