https://oktelugu.com/

Nithya Menen: ఒక ఈవెంట్ లో నిత్యామీనన్ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు…

తాజాగా నిత్యామీనన్ చేసిన ఒక పనిపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈమె ప్రవర్తనపై సోషల్ మీడియాలో నేటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా హీరోయిన్ నిత్యామీనన్ ఒక ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. ఆ ఈవెంట్ లో నిత్యామీనన్ మేనేజర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది.

Written By:
  • Mahi
  • , Updated On : January 10, 2025 / 03:39 PM IST

    Nithya Menen

    Follow us on

    Nithya Menen: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తన అందంతో, అభినయంతో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా నిత్యామీనన్ చేసిన ఒక పనిపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈమె ప్రవర్తనపై సోషల్ మీడియాలో నేటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా హీరోయిన్ నిత్యామీనన్ ఒక ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. ఆ ఈవెంట్ లో నిత్యామీనన్ మేనేజర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. అదే ఈవెంట్ లో ఆమె డైరెక్టర్ మిష్కిన్ కు ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని హగ్ చేసుకుంది. దాంతో వ్యక్తుల స్థాయికి నిత్యామీనన్ ప్రవర్తిస్తున్నారని, ఇది సరైనది కాదని సోషల్ మీడియా ద్వారా పలువురు నెట్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే హీరోయిన్ నిత్యామీనన్ భారతీయ నటితోపాటు, గాయని కూడా. ఈమె పలు సినిమాలలో నటించడంతోపాటు, పాటలు పాడడం కూడా జరిగింది. ఈమె మొదటిసారిగా ఎనిమిది సంవత్సరాల చిన్న వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ద మంకీ హ్యు న్యూ టూ మచ్ అనే ఆంగ్ల చిత్రంలో నటించడం జరిగింది. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ టబుకు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత నిత్యామీనన్ 17 సంవత్సరాల వయస్సులో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్రలో నటించింది. ఆ తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళం సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. నిత్యా మీనన్ 1988లో బెంగళూరులో సెటిల్ అయినా మలయాళీ కుటుంబంలో జన్మించింది.

    నటిని అవుతానని నిత్యామీనన్ ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ తర్వాత ఆమెకు నటన మీద ఉన్న ఆసక్తితో పూణేలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్స్ లో చేరింది. అక్కడ నిత్యామీనన్ కు బి వి నందిని రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే నిత్యామీనన్ నందిని రెడ్డి దర్శకత్వంలో అలా మొదలైంది అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో, నటనతో ఆకట్టుకొని నిత్యామీనన్ ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. ప్రముఖ నటుడు మోహన్ లాల్ తో కూడా ఈమె ఒక సినిమాలో నటించింది.

    నిత్యామీనన్ మాతృభాష మలయాళం అయినప్పటికీ ఆమెకు ఇతర భాషలు నేర్చుకోవాలంటే ఎంతో ఆసక్తి. ఆసక్తితోనే నిత్యామీనన్ తన తొలి సినిమా అలా మొదలైంది లో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, అబ్బబ్బో అబ్బో అనే రెండు పాటలను పాడింది. ఇక ఈమె తెలుగులో అలా మొదలైంది సినిమా తర్వాత సెగ, 180, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి పలు సినిమాలలో నటించింది. ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి.ఈ రెండు సినిమాలలోనూ నిత్యా మీనన్ హీరో నితిన్ కు జోడిగా నటించడం తో వాళ్ళిద్దరిది హిట్ పెయిర్ అని కూడా టాక్ వచ్చింది.