Ram Chara- NTR: నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వైరం ఇప్పటిది కాదు. వీరు ఒకరికి ఒకరు తమ ప్రధాన శత్రువులుగా భావిస్తారు. ఈ క్రమంలో ఈ రెండు కుటుంబాల హీరోలు కూడా సన్నిహితంగా ఉండేవారు కాదు. ఏదో సందర్భం వస్తే కలవడం తప్పితే పనిగట్టుకొని పలకరించే పద్ధతి లేదు. చిన్నగా సమీకరణాలు మారాయి. రాజకీయ కారణాలతో ఎన్టీఆర్ బాలకృష్ణకు దూరం అయ్యారు. ఈ క్రమంలో చరణ్, మహేష్ వంటి తోటి స్టార్స్ కి అతడు స్నేహితుడయ్యారు. ఈ కారణంగానే మెగా-నందమూరి హీరోల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ సాధ్యమైంది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి కావడం కూడా ఒక కారణం.
హీరోలు కలిసినా ఫ్యాన్స్ మధ్య వైరం అలానే ఉంది. ఎన్టీఆర్-చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ లో ఎవరి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందనే చర్చ నడుస్తుంది. ఇక సినిమా విడుదల తర్వాత ఇరు హీరోల ఫ్యాన్స్ మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ సోషల్ మీడియా దాడులకు దిగారు. సినిమా విడుదలై రెండు నెలలు దాటిపోగా ఈ వివాదం కొంచెం సద్దుమణిగింది.
Also Read: Major Crossed Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాని దాటేసిన మేజర్
కాగా జూన్ 1న యూఎస్ లో 100 స్క్రీన్స్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని మరోసారి విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ అన్ కట్ వర్షన్ అమెరికా థియేటర్స్ లో ప్రదర్శించారు. రెండోసారి కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి భారీ ఆదరణ దక్కింది. ఈ చిత్రాన్ని చూడటానికి అక్కడి ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్ వార్ మళ్ళీ నిద్ర లేచింది. నిన్నటి నుండి ట్విట్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తమ హీరోలను ఎలివేట్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. మా హీరో గొప్పంటే మా హీరో అంటూ కొట్టుకుంటున్నారు.
ఇక ఈ వివాదం బయటి నుండి గమనిస్తున్నవారు.. ఓ అద్భుత చిత్రాన్ని ఆస్వాదించకుండా ఈ గొడవలేంటి అంటున్నారు. రాజమౌళి ఇద్దరు హీరోల పాత్రలకు న్యాయం చేశారు. రామ్ లేకుండా భీమ్ లేడు… అదే సమయంలో భీమ్ లేకుండా రామ్ లేడు. కాబట్టి ఇప్పటికైనా ఈ అర్థం లేని డిబేట్ కి ఫుల్ స్టాప్ పెట్టాలంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ గా రూ. 1150 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది.
Also Read:RRR Re-Release In USA: USA లో RRR రీ – రిలీజ్.. మరోసారి వసూళ్ల ప్రభంజనం