Sarkaru Vaari Paata on Amazon: సర్కారు వారి పాట మూవీతో మహేష్ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ దాదాపు రూ. 250 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. దర్శకుడు పరశురామ్ సోషల్ బర్నింగ్ టాపిక్ ని ఎంటర్టైనింగ్ గా చెప్పిన విధానం ఆకట్టుకుంది. మహేష్ మేనరిజం, కీర్తి సురేష్ గ్లామర్, కెమిస్ట్రీ అదిరిపోయాయి. ఇక సర్కారు వారి పాట రన్ ఆల్మోస్ట్ ముగిసింది. మూడు వారాలు సాలిడ్ కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ కొత్త సినిమాల రాకతో థియేటర్స్ కోల్పోనుంది. ఈ క్రమంలో సర్కారు వారి పాట డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైంది.
సర్కారు వారి పాట ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. నేటి నుండే మూవీ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. రెంటల్ ఆప్షన్ లో ఈ మూవీ అందుబాటులోకి తెచ్చారు. అంటే రూ.199 చెల్లించి మూవీ చూడాలన్నమాట. ఇది అభిమానులను నిరాశపరిచే అంశమే. సర్కారు వారి పాట చిత్రాన్ని బుల్లితెరపై మరోసారి వీక్షిద్దామనుకున్న ప్రైమ్ కస్టమర్స్ పై రెంటల్ భారం పడనుంది.
Also Read: Major Crossed Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాని దాటేసిన మేజర్
ఇండియన్ బ్లాక్ బస్టర్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని కూడా ప్రైమ్ ఇదే పద్ధతిలో అందుబాటులోకి తెచ్చింది. దాదాపు మూడు వారాలు రెంట్ చెల్లించి వీక్షించే ఏర్పాటు చేసింది. జూన్ 3వ తేదీ నుండి కెజిఎఫ్ 2 ఫ్రీగా అందుబాటులోకి రానుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ పై కూడా రెంట్ వసూలు చేయాలని భావించారు. ఒక్క హిందీ మినహాయించి ఆర్ ఆర్ ఆర్ అన్ని భాషల హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పే పర్ వ్యూ లేదా రెంటల్ విధానంలో విడుదల చేయాలని భావించారు. అభిమానుల కోరిక మేరకు ఆలోచన విరమించుకొని ఫ్రీగా ప్రదర్శించారు. అలాంటిది సర్కారు వారి పాట చిత్రాన్ని రెంటల్ పై ప్రైమ్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్కారు వారి పాట చిత్రాన్ని కొన్ని వారాలు రెంట్ చెల్లించి ప్రైమ్ చందాదారులు వీక్షించాలి. తర్వాత ఫ్రీగా చూసే వెసులుబాటు ఉంటుంది. మహేష్ అభిమానులకు రూ. 199 అంటే పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. ఈ విధంగా ప్రైమ్ మహేష్ చిత్రంపై మరింత ఆర్జించే అవకాశం కలదు.
మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ , 14 ప్లస్ రీల్స్ సంయుక్తంగా సర్కారు వారి పాట చిత్రాన్ని నిర్మించాయి. సముద్ర ఖని, సుబ్బరాజ్, అజయ్, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ కీలక రోల్స్ చేశారు. థమన్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Also Read:Ram Chara- NTR: ఎన్టీఆర్ వర్సెస్ చరణ్… ఈ గొప్పల కొట్లాటకు అంతం లేదా!
Recomended Videos