Major Crossed Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అని అనిపించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా మొదటి ఆట నుండే యావేరేజి టాక్ ని సొంతం చేసుకుంది..మహేష్ బాబు కి ఫామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా యావేరేజి గా ఉన్నప్పటికీ కూడా గట్టెకేసింది అని చెప్పొచ్చు..కానీ ఈ సినిమా విడుదల కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్ లో ఆశించిన స్థాయి లో లేవు అనే చెప్పాలి..దానికి కారణం కూడా లేకపోలేదు..నైజం ప్రాంతం లో ఈ సినిమా టికెట్ రేట్స్ దాదాపుగా 350 రూపాయలకు పెంచారు..అందుకే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు అని ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట..సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్స్ పెడితే దానికి ఫలితం ఎలా ఉంటుందో రేపు విడుదల అవ్వబోతున్న అడవి శేష్ మేజర్ మూవీ ఒక్క ఉదాహరణ అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
Also Read: Modi Visit to Hyderabad: మోడీ మళ్లీ హైదరాబాద్ పర్యటన.. అందుకేనా?
అడవి శేష్ మరియు సాయి మంజ్రేకర్ హీరో హీరోయిన్లు గా నటించిన మేజర్ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించాడు..టికెట్ రేట్స్ భారీ గా పెంచడం వల్ల తానూ హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా పై నైజాం ప్రాంతం లో ఎలాంటి ప్రభావం పడిందో స్వయంగా చూసిన మహేష్ బాబు, తానూ నిర్మాతగా వ్యవహరిస్తున్న మేజర్ సినిమాకి మాత్రం అలాంటి పొరపాటు చెయ్యకుండా జాగ్రత్త పడ్డాడు..సామాన్యుడికి అందుబాటులో ఉండేట్టు గా మల్టీప్లెక్స్ కి 195 రూపాయిలు, మరియు సింగల్ స్క్రీన్స్ కి 150 రూపాయలతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యడం తో, ఈ సినిమా బుకింగ్స్ స్టార్ హీరో రేంజ్ స్పీడ్ లో జరుగుతున్నాయి..ఒక్కమాట లో చెప్పాలి అంటే సర్కారు వారి పాట సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కంటే మేజర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతో స్పీడ్ గా ఉండడం చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు..గతం లో ఇష్టమొచ్చినట్టు టికెట్ రేట్స్ పెంచేసి లాంగ్ రన్ రావాల్సిన ఇలాంటి ఎన్నో సినిమాల రన్ ని చెడగొట్టేసారు అని పెదవి విరుస్తున్నారు..ఇక నుండి అయినా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్స్ పెట్టి థియేటర్స్ ని కాపాడాలి అని ట్రేడ్ విశ్లేషకులు కోరుకుంటున్నారు.
Also Read: KCR- Rythu Bandhu: రైతుబంధుపై కేసీఆర్ షాకింగ్ నిర్ణయం?
Recomended Videos