https://oktelugu.com/

అలసిన నిమ్మగడ్డ.. అస్త్రసన్యాసం

ఏపీలోని జగన్ సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్. టీడీపీ హయాంలో నియామకమైన ఈయన జగన్ తో తలపడి సుప్రీంకోర్టు దాకా వెళ్లి విజయం సాధించారు. జగన్ ఎవరి చేతుల మీదుగా అయితే ఎన్నికలు వద్దన్నారో ఆయన చేతుల మీదుగానే జరపాల్సిన పరిస్థితిని నిమ్మగడ్డ సృష్టించారు. జగన్ , మంత్రులతో ఫైట్ లో విజయం సాధించిన నిమ్మగడ్డ వారికి నష్టం చేకూర్చకపోగా లాభమే చేశారు. పంచాయతీ, […]

Written By: , Updated On : March 24, 2021 / 02:24 PM IST
Follow us on

Jagan

ఏపీలోని జగన్ సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్. టీడీపీ హయాంలో నియామకమైన ఈయన జగన్ తో తలపడి సుప్రీంకోర్టు దాకా వెళ్లి విజయం సాధించారు. జగన్ ఎవరి చేతుల మీదుగా అయితే ఎన్నికలు వద్దన్నారో ఆయన చేతుల మీదుగానే జరపాల్సిన పరిస్థితిని నిమ్మగడ్డ సృష్టించారు.

జగన్ , మంత్రులతో ఫైట్ లో విజయం సాధించిన నిమ్మగడ్డ వారికి నష్టం చేకూర్చకపోగా లాభమే చేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను జగన్ సర్కార్ కు ఇష్టం లేకున్నా నిర్వహించారు. అయితే నిమ్మగడ్డ ఒకటి తలిస్తే అది మరొకటి అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రజలంతా అధికార పార్టీకే గుద్దేశారు.

ఇప్పుడు జగన్ సర్కార్ ఆ పరిషత్ ఎన్నికలు కూడా ఇదే నిమ్మగడ్డ నిర్వహించాలని కోరగా.. ఆయన మాత్రం ఇక చాలించుకున్నారు. తాను ఎన్నికలు నిర్వహించనని.. వచ్చే కొత్త ఎస్ఈసీ ఆ బాధ్యతలు తీసుకోవాలని అస్త్రసన్యాసం చేశారు.

తాజాగా ఏపీలో ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఉత్తర్వులు జారీ చేశారు. 4 వారాల ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనని పేర్కొన్నారు.

ఇలా జగన్ తో భీకరంగా పోరాడిన నిమ్మగడ్డ వ్రతం చెడ్డా ఫలితం అందుకోలేకపోయారు. అందుకే ఈ పోరాటం కంటే రిటైర్ మెంట్ బెటర్ అని నిర్ణయించుకొని వైదొలుగుతున్నారు.