https://oktelugu.com/

వారికి ఆ చాన్స్ కూడా ఇవ్వని సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాల కడుపుకొడుతున్నారు. ప్రతిపక్ష పాత్రను కూడా ప్రభుత్వమే పోషిస్తూ.. వారికి పనిలేకుండా చేస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పక్షాలంటే.. ఉద్యమాలు, వీధిపోరాటాలు చేస్తుండడం సహజం. అప్పుడప్పుడు రాష్ర్ట, దేశవ్యాప్త బంద్ లు కూడా చేస్తుంటాయి. వాటిని ప్రభుత్వాలు అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రతిపక్ష నేతల్ని ఈడ్చి పడేయడాలు, అరెస్టులు చేయడం, తదితర చిత్రాలు కనిపిస్తుంటాయి. Also Read: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలు..? ఏపీ […]

Written By: Srinivas, Updated On : March 24, 2021 2:14 pm
Follow us on

CM Jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాల కడుపుకొడుతున్నారు. ప్రతిపక్ష పాత్రను కూడా ప్రభుత్వమే పోషిస్తూ.. వారికి పనిలేకుండా చేస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పక్షాలంటే.. ఉద్యమాలు, వీధిపోరాటాలు చేస్తుండడం సహజం. అప్పుడప్పుడు రాష్ర్ట, దేశవ్యాప్త బంద్ లు కూడా చేస్తుంటాయి. వాటిని ప్రభుత్వాలు అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రతిపక్ష నేతల్ని ఈడ్చి పడేయడాలు, అరెస్టులు చేయడం, తదితర చిత్రాలు కనిపిస్తుంటాయి.

Also Read: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలు..?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుణ్యమా అని ప్రస్తుతం రాష్ట్రంలో అవేవీ కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ఈనెల 26న అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు భారత్ బంద్ కు పిలపునిచ్చారు. ఈ బందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించేసింది. రైతులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు చేసే ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పెర్ని నాని వెల్లడించారు.

ఇందులో భాగంగా ఈనెల 26న ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నాని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను సీఎం జగన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఆయన మరోసారి స్పష్టం చేశారు. భారత్ బంద్ కు బీజేపీ, జనసేన మినహా ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ , వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. వైసీపీ మద్దలు ఇవ్వకూడదని ప్రతిక్ష పార్టీలన్నీ లోలోపల కోరుకున్నాయి. ఎందుకంటే.. రైతులు, కార్మికుల వ్యతిరేక పార్టీగా వైసీపీపై ముద్రవేసి ప్రజావ్యతిరేకత పెంచాలని పరితపించిన ప్రతిపక్షాల ఆశలన్నీ జగన్ సర్కారు నిర్ణయంతో నీరుగారిపోయాయి.

Also Read: తిరుపతిలో బీజేపీకి మరో చిక్కు.. ఆ రూ.120కోట్లు..?

ఈ మధ్యనే రైతులకు మద్దతుగా ఇదే విధంగా బంద్ కు సర్కారు సంపూర్ణ మద్దతు తెలిపింది. వైసీపీ ప్రభుత్వమే నేరుగా బందులో పాల్గొనడంతో బస్సులను డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకునే శ్రమనే ప్రతిక్షాలకు లేకుండా పోయింది. దీంతో ప్రచారం కరువైంది. ప్రతిక్షాల ఆశలకు జగన్ సర్కారు ఈ విధంగా గండి కొడుతుందన్న మాట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్