Nithin Thammudu collection: తీవ్రమైన సంక్షోభం లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ‘కుబేర'(Kuberaa Movie) హిట్ తో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమా విడుదలైన వారం గ్యాప్ లో మంచు విష్ణు(Manchu Vishnu) ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie) విడుదలైంది. ఈ సినిమా నిర్మాతలకు నష్టం చేసినా కూడా, ఒక పది రోజుల పాటు థియేటర్స్ నడిచేంత రన్ ని అయితే సొంతం చేసుకుంది. ఇప్పటికీ కూడా డీసెంట్ స్థాయి రన్ తోనే ముందుకు వెళ్తుంది. పర్లేదు టాలీవుడ్ మళ్ళీ గాడిలో పడుతుంది అని ఆనందించే లోపు నితిన్(Actor Nithin) ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం టాలీవుడ్ ని మరోసారి చావు దెబ్బ కొట్టింది. వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వం లో, దిల్ రాజు(Dil Raju) నిర్మాత గా వ్యవహరించిన ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చిన డబ్బులు తప్ప, థియేటర్స్ నుండి ఏ మాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది.
Also Read: ఆ విషయం లో త్రివిక్రమ్ కి సీతారామశాస్త్రి కి మధ్య పెద్ద గొడవ జరిగిందా..? వైరల్ వీడియో…
కనీసం యావరేజ్ రేంజ్ టాక్ వచ్చినా కూడా ఈ రేంజ్ ఫలితం ఉండేది కాదేమో, కానీ మొదటి ఆట నుండే ‘ఇదేమి సినిమా రా బాబోయ్’ అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకోవడం వల్లే ఇలాంటి పరాభవం ఎదురుకోవాల్సి వచ్చింది. మొదటి మూడు రోజులకు కలిపి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నాల్గవ రోజు అయితే మరీ దారుణం. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి పట్టుమని 16 లక్షల రూపాయిలు కూడా రాలేదు. అలా నాలుగు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఐదవ రోజు పరిస్థితి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, మీకు ఈపాటికే అర్థం అయిపోయి ఉంటుంది.హైదరాబాద్ లాంటి టాప్ సిటీ లో థియేటర్స్ రెంట్స్ ని కూడా రీకవర్ చెయ్యలేకపోయింది అట నిన్న. అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఎదో మల్టీప్లెక్స్ థియేటర్స్ పుణ్యమా అని కమీషన్ బేసిస్ మీద రన్ రావడం తో 5 వ రోజు నాలుగు లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.
Also Read: నేరుగా ఓటీటీ లోకి రాబోతున్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’..ఇదేమి ట్విస్ట్ సామీ!
ఈ నెల 24 వ తేదీన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుంది. అప్పటి వరకు థియేటర్స్ మొత్తం ఈ తమ్ముడు చిత్రాన్ని భరించాలి. అనేక ప్రాంతాల్లో కనీసం కరెంటు ఖర్చులకు సరిపడే కలెక్షన్స్ కూడా రాకపోవడం తో థియేటర్స్ ని మూసి వేస్తున్నారట. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కూడా కలిపి ఈ చిత్రానికి 3 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. పాపం నితిన్ అదృష్టం ఏంటో ఇలా ఉంది. ప్రామిసింగ్ డైరెక్టర్స్ తో మంచి స్క్రిప్ట్స్ ని అయితే ఎంచుకుంటున్నాడు కానీ, డైరెక్టర్స్ సరైన టేకింగ్ తో సినిమాలు తీయకపోవడం వల్ల ఇంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్నాడు.