Trivikram vs Sitarama Sastry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మంత్రకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)… మొదట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించడం విశేషం…ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నాడు. 2024 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘గుంటూరు కారం’ (Gunturu Karam) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథ మొత్తాన్ని ఫైనల్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాలో త్రిష ను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సీతారామశాస్త్రి గురించి గుర్తు చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది… అదేంటి అంటే అతడు సినిమాలో ఇంట్రాడక్షన్ సాంగ్ ఉండాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెబితే అది అవసరం లేదు అని సీతారామశాస్త్రి చెప్పారట. సిచువేషన్ కి తగ్గట్టుగా అది అక్కడ సెట్ అవ్వదు అని సీతారామశాస్త్రి చెబుతున్నాడు. ఇలా చాలా రోజులపాటు వీళ్లిద్దరి మధ్య ఒక ఘర్షణ అయితే నడిచిందట. ఇద్దరు ఖాళీ గా ఉన్న సమయంలో ఆ పర్టిక్యూలర్ సిచువేషన్ గురించి ఆ సాంగ్ గురించి చర్చించుకొని మరి ఘర్షణ పడేవారిని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పడం విశేషం…
Also Read: దిల్ సినిమా కోసం నితిన్ ను అలా తీసుకున్నారా.? సంచలన విషయాన్ని చెప్పిన దిల్ రాజు…
ఇక ఇదంతా కాదని మణిశర్మ గారితో ఒక ట్యూన్ చేయించి త్రివిక్రమ్ ఓన్ గా కొన్ని లిరిక్స్ రాసి రికార్డ్ చేసి సీతారామశాస్త్రి గారికి వినిపించారట. ఇది మొత్తం విన్న సీతారామశాస్త్రి పాట బానే ఉంది. కానీ కొన్ని గ్రమటికల్ మిస్టేక్స్ ఉన్నాయి అవి లేకుండా ఉంటే బాగుండేది అని చెప్పాడట.
మొతానికైతే ఆయన అక్కడ పాట ఉండాల్సిందే అని ఫిక్స్ సాయి సాంగ్ రాశాడట. ఆ సాంగ్ ఎంత పెద్ద పాపులారిటి ని సంపాదించుకుంధో మనందరికి తెలిసిందే… ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సీతారామశాస్త్రికి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉందనే విషయం మనందరికి తెలిసిందే…
Also Read: దిల్ రాజు తో కయ్యానికి సిద్దమైన నిర్మాత నాగవంశీ..తారా స్థాయికి చేరిన ఈగో క్లాష్!
త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళ భార్య సీతారామశాస్త్రి వాళ్ళ తమ్ముడి కూతురు కావడం వల్ల కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉండేది. ఇవి వీళ్ళు మామ అల్లుళ్లు గానే కాకుండా అంతకుమించిన రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ వచ్చేవారు…ఇక ప్రస్తుతం సీతారామ శాస్త్రి లేకపోవడం అందరికీ బాధను కలిగించే విషయం అనే చెప్పాలి. నిజానికి ఆయన లేని లోటు ను భర్తీ చేసేవారు లేకపోవడం ఇండస్ట్రీ కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి…
